క్రికెట్లో జాతివివక్ష వ్యతిరేక ఉద్యమానికి కొత్త పంథా అవసరమని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(Jason Holder) అన్నాడు. మ్యాచ్‌లకు ముందు మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలపడం ఒక్కటే సరిపోదని వ్యాఖ్యానించాడు.
"దీని గురించి చర్చించాను. మ్యాచ్‌కు ముందు చేసే ఈ పని నీరుగారిపోయిన చర్యగా కొంతమంది భావిస్తున్నారని నేను అనుకుంటున్నా. మళ్లీ ఈ ఉద్యమాన్ని రగిలించడానికి కొత్త పంథాను చూడాలనుకుంటున్నా. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' కోసం మోకాళ్లపై నిలబడటం సంప్రదాయమనో, నిబంధన అనో అని ప్రజలు అనుకోవద్దు. దీనికో అర్థం ఉండాలి. ఉద్యమాన్ని తిరిగి ప్రేరేపించడం కోసం మరింత ఆలోచనా ప్రక్రియ అవసరం."
- జేసన్ హోల్డర్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్
ఏడాది కిందట ఆఫ్రికా అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం మొదలైన 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమానికి(Black Lives Matter Protest) మోకాళ్లపై నిలబడి మద్దతిచ్చిన రెండు అంతర్జాతీయ జట్లలో వెస్టిండీస్ ఒకటి.
ఇదీ చూడండి.. 'అతడి బౌలింగ్లో కోహ్లీ తడబడుతున్నాడు!'