Ishan Kishan India Vs Australia T20 Series : ఇటీవల ముగిసిన 2023 వన్డే వరల్డ్‌కప్‌లో యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. అతడు ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా.. టోర్నీలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో మాత్రం.. మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ (58 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. మెగాటోర్నీలో బెంచ్‌కే పరిమితమైనా.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం ఆపలేదట ఇషాన్. ఇప్పుడు అదే తనకు సాయపడిందని అతడు పేర్కొన్నాడు.
"వరల్డ్ కప్ సందర్భంగా నేను తుది జట్టులో లేనప్పటికీ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేశా. 'ఈరోజు నేనేం చేయాలి. ఈ సెషన్ నాకు ఎందుకు ముఖ్యం' అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తునే ఉన్నా. నా ఆట గురించి ఎప్పటికప్పుడు కోచింగ్ సిబ్బందితో నా మాట్లాడా. ఏ బౌలర్‌ను టార్గెట్ చేయాలి? ఇన్నింగ్స్‌ను ఎలా ముందుకు నడిపించాలి? లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా లెగ్ స్పిన్నర్ వేసే బంతులపై నాకు ఓ అంచనా ఉంది." అని ఇషాన్ పేర్కొన్నాడు.
"పెద్ద టార్గెట్లు ఛేజ్ చేసేటప్పుడు.. చివరి దాకా క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాలి. తప్పకుండా ఒక బౌలర్‌ను లక్ష్యంగా చేసుకొని ఎటాక్ చేయాలి. ఈ ఇన్నింగ్స్‌పై సూర్యకుమార్‌తో మాట్లాడాను. సంఘా బౌలింగ్‌ను ఎటాక్ చేయాలాని అనుకున్నాం. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయాం. అప్పుడు పార్ట్నర్షిప్ ముఖ్యమని నాకు తెలుసు. ఐపీఎల్‌లో మేమిద్దరం కలిసి ఆడిన అనుభవం ఉంది. మా ఇద్దరికి ఒకరి ఆట గురించి ఒకరికి తెలుసు. విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా లేదు. మనోళ్లతోపాటు ఆసీస్ స్పిన్నర్లు కూడా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లిస్ ఆడిన తీరు చూస్తే.. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగానే అనిపించింది. ఛేజింగ్‌లోనూ మేం ఒత్తిడికి గురికాలేదు. ఇక చివర్లో రింకూ అద్భుతం" అని ఇషాన్ అన్నాడు.
విశాఖపట్టణం వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
-
What A Game!
— BCCI (@BCCI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
What A Finish!
What Drama!
1 run to win on the last ball and it's a NO BALL that seals #TeamIndia's win in the first #INDvAUS T20I! 👏 👏
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU @IDFCFIRSTBank pic.twitter.com/J4hvk0bWGN
">What A Game!
— BCCI (@BCCI) November 23, 2023
What A Finish!
What Drama!
1 run to win on the last ball and it's a NO BALL that seals #TeamIndia's win in the first #INDvAUS T20I! 👏 👏
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU @IDFCFIRSTBank pic.twitter.com/J4hvk0bWGNWhat A Game!
— BCCI (@BCCI) November 23, 2023
What A Finish!
What Drama!
1 run to win on the last ball and it's a NO BALL that seals #TeamIndia's win in the first #INDvAUS T20I! 👏 👏
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU @IDFCFIRSTBank pic.twitter.com/J4hvk0bWGN
చరిత్ర సృష్టించిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్- టీవీల్లో 30 కోట్ల మంది వీక్షణం
మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై ఛీటింగ్ కేసు! - రూ. 18.70 లక్షలు మోసగించారని!