ETV Bharat / sports

IPL 2021: తగ్గేదేలే.. అప్పటిలానే ఆడతాం: కోహ్లీ - విరాట్​ కోహ్లీ ఐపీఎల్ 14 పరుగులు

ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశ మొదలవనున్న వేళ ఆర్​సీబీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్ ప్రారంభంలో ఆడినట్లే ఇప్పుడూ ఆడతామని స్పష్టం చేశాడు. నూతన ఆటగాళ్ల చేరికతో జట్టు బలోపేతంగా తయారైందని అభిప్రాయపడ్డాడు.

VIRAT KOHLI
VIRAT KOHLI
author img

By

Published : Sep 19, 2021, 4:44 PM IST

Updated : Sep 19, 2021, 5:21 PM IST

ఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలి దశలో ఎలా ఆడామో ఇప్పుడూ అలాగే ఆడతామని.. అంతే ప్యాషన్‌, పట్టుదలతో బరిలోకి దిగుతామని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Rcb Team 2021) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) స్పష్టం చేశాడు. తొలుత ఏప్రిల్‌ 9న మొదలైన ఈ సీజన్‌ కరోనా విజృంభణ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఆదివారం(సెప్టెంబరు 19) నుంచి యూఏఈలో తిరిగి ప్రారంభం కానుంది(IPL 2021 Second Phase). ఆర్సీబీ సోమవారం కోల్‌కతాతో తలపడనుంది. ఈ సందర్భంగా కోహ్లీ రానున్న సీజన్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'తొలి భాగంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆడం జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ ఇప్పుడు ఆడటం లేదు. వారి స్థానాల్లో శ్రీలంక ఆటగాళ్లు వానిండు హసరంగ, చమీర దుష్మంత జట్టులోకి వచ్చారు. వీరికి యూఏఈ లాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో బాగా తెలుసు. వీళ్ల నైపుణ్యాలు మా జట్టుకు(RCB Team Changes) బాగా ఉపయోగపడతాయి. వీరి చేరికతో జట్టు మరింత బలోపేతంగా తయారవుతుంది' అని కోహ్లీ చెప్పాడు.

'ఈ టోర్నీలో ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండటం వల్ల పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచినా ఎనిమిదో మ్యాచ్‌ను కూడా అంతే పట్టుదల, ప్రొఫెషనలిజమ్‌తో ఆడాలి. ఒకవేళ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనా ఆరో మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియదు కాబట్టి ప్రతిదీ ఇలాగే జరుగుతుందని ఆశించొద్దు. ఇకపోతే బయట నుంచి అనేక విశ్లేషణలు, సమాచారం, పాయింట్లు.. అనే లెక్కలు ఉంటాయి. వాటిపై ఆధారపడి మ్యాచ్‌లు ఆడలేం. ఆ సమయానికి మనం ఎలా ఉన్నాం, ఎలా స్పందిస్తున్నాం, మన ప్రణాళికలు ఏంటి? వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామా లేదా అనే వాటిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి' అని కోహ్లీ వివరించాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే మంచి విజయాలు సాధించామని, ఆ నమ్మకమే ముందుకు నడిపిస్తుంది' అని కెప్టెన్‌ విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 19, 2021, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.