ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. తాలిబన్లు దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో అఫ్గాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, నబీ ఎక్కడున్నారు? త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్లో ఆడతారా అనే ప్రశ్నలు అభిమానులకు వస్తున్నాయి. అయితే వారిద్దరూ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ షణ్మగమ్ సోమవారం స్పష్టం చేశారు. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు జరగనున్నాయి.
అయితే అఫ్గానిస్థాన్ ప్రస్తుత పరిస్థితిపై స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆందోళనగా ఉన్నాడని, అక్కడే ఉన్న తన కుటుంబాన్ని దేశం నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నాడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ చెప్పాడు. ప్రస్తుతం 'ద హండ్రెడ్'లో ఆడుతున్న రషీద్.. యూకేలో ఉన్నాడు.
ఏప్రిల్‌లో కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌ను తిరిగి యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 19 నుంచి మొత్తంగా 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఒక్కొక్కటిగా ఆ దేశానికి చేరుకుంటున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది.
ఇవీ చదవండి: