ETV Bharat / sports

అభిమానులకు గుడ్​ న్యూస్.. మరోసారి తండ్రి కాబోతున్న ధోనీ - IPL Final 2021

చెన్నై సూపర్​ కింగ్స్ సారథి ఎంఎస్​ ధోనీ(Dhoni Sakshi News ) అభిమానులుకు తీపికబురు​ చెప్పింది సీఎస్కే బ్యాట్స్​మన్ సురేష్ రైనా భార్య ప్రియాంక. మహీ భార్య సాక్షి ప్రస్తుతం గర్భంతో ఉన్నట్లు తెలిపింది.

dhoni sakshi
ధోనీ సాక్షి
author img

By

Published : Oct 16, 2021, 4:03 PM IST

Updated : Oct 17, 2021, 11:17 AM IST

ఐపీఎల్​ ఫైనల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ను ఓడించి విజేతగా నిలిచింది చెన్నై సూపర్​ కింగ్స్(CSK vs KKR 2021). ఈ గెలుపుతో సీఎస్కే ఫ్యాన్స్​ ఫుల్​ జోష్​లో ఉన్నారు. ఈ క్రమంలోనే ధోనీ అభిమానులకు మరో గుడ్​ న్యూస్​ చెప్పింది సీఎస్కే బ్యాట్స్​మన్ సురేష్ రైనా సతీమణి ప్రియాంక. మహీ(Dhoni Sakshi News) తండ్రి కాబోతున్నాడని చెప్పింది.

ధోనీ భార్య సాక్షి(Dhoni Sakshi News) ప్రస్తుతం నాలుగు నెలల గర్భంతో ఉందని ప్రియాంక వెల్లడించింది. దీంతో నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా మహీకి కంగ్రాట్స్​ చెబుతున్నారు. బుల్లి ధోనీ జన్మిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ధోనీ-సాక్షి జంటకు 2010లో వివాహం జరగగా.. 2015లో వీరికి జీవా సింగ్ జన్మించింది. జీవా అంటే మహీకి విపరీతమైన ప్రేమ. ఖాళీ దొరికినప్పుడల్లా తనతో ఎంతో సరదాగా గడుపుతుంటాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సాక్షి సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తుంటుంది.

భారీ లక్ష్యం..

శుక్రవారం జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ 193 పరుగులు భారీ లక్ష్యాన్ని కోల్​కతా ముందు ఉంచింది. మంచి ఫామ్​లో ఉన్న సీఎస్కే ఓపెనర్ల ద్వయం రుతురాజ్‌ గైక్వాడ్‌ (32: 3 ఫోర్లు, ఒక సిక్సర్), డుప్లెసిస్‌ (86: 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం ఛేదనలో కోల్​కతా అదరలేదు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (51: 6 ఫోర్లు), వెంకటేశ్‌ అయ్యర్ (50: 5 ఫోర్లు, 3 సిక్సర్లు) గట్టి పునాది వేశారు. అయినప్పటికీ మిడిలార్డర్​ విఫలమవడం వల్ల కోల్​కతా కప్పు గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది.

ఇదీ చదవండి:

IPL 2021 records: చెన్నై ఓపెనర్లు సరికొత్త రికార్డు

IPL 2021 Final: చెన్నై 'సూపర్​' కింగ్స్​.. ఖాతాలో నాలుగో ట్రోఫీ

Last Updated : Oct 17, 2021, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.