Dewald brevis IPL 2022: ఐపీఎల్ మెగా లీగ్ 15వ సీజన్లో సిక్సర్లు, ఫోర్ల మోత మోగిపోతోంది. ఒకరిని మించి ఒకరు తగ్గేదేలే అంటూ బంతిని బౌండరీ దాటిస్తున్నారు. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ యువ ఆటగాడు జూనియర్ 'ఏబీ' డెవాల్డ్ బ్రెవిస్ జూలు విదిల్చాడు. భారీ సిక్సర్లతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రాహుల్ చాహర్‌ను ఉతికారేశాడు. వరుసగా ఓ ఫోర్, నాలుగు సిక్సులతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు.
అదే ఓవర్ ఆఖరి బంతికి బ్రెవిస్ బాదిన ఓ సిక్సర్.. 112 మీటర్ల దూరం వెళ్లింది. దీంతో ఐపీఎల్ 2022లోనే లాంగెస్ట్ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. జూనియర్ ఏబీ కొట్టిన భారీ సిక్సర్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ కొట్టిన 108 మీటర్ల సిక్సర్ లాంగెస్ట్గా ఉండేది.
-
112 meter six by Dewald Brevis - longest in #IPL2022 pic.twitter.com/ofDn7NjrfI
— Ranjeet - Wear Mask😷 (@ranjeetsaini7) April 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">112 meter six by Dewald Brevis - longest in #IPL2022 pic.twitter.com/ofDn7NjrfI
— Ranjeet - Wear Mask😷 (@ranjeetsaini7) April 13, 2022112 meter six by Dewald Brevis - longest in #IPL2022 pic.twitter.com/ofDn7NjrfI
— Ranjeet - Wear Mask😷 (@ranjeetsaini7) April 13, 2022
ఈ మ్యాచ్‌లో 196 స్ట్రైక్ రేట్‌తో 25 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 49 పరుగులు సాధించిన బ్రెవిస్.. త్రుటిలో ఐపీఎల్ తొలి అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఒడియన్ స్మిత్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐపీఎల్లో ఎలాంటి అనుభవం లేని జూనియర్ ఏబీ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంపై సీనియర్లు ప్రశంసలు కురిపించారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. 199 పరుగుల లక్ష్య ఛేదనలో 186కే పరిమితమై.. ఐపీఎల్ 2022లో వరుసగా ఐదో ఓటమిని నమోదు చేసింది.
ఇదీ చూడండి: IPL 2022: ఐదు సార్లు ఛాంపియన్‌కు ఐదో ఓటమి..