టీమ్ఇండియాలో తనకు చోట్టు దక్కడంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కీలక పాత్ర పోషించిందని అన్నాడు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్. వచ్చే ఐపీఎల్ సీజన్లో భాగంగా ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియ పూర్తైంది. ఈ నేపథ్యంలోనే తనను అట్టిపెట్టుకున్న కేకేఆర్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఈ వ్యాఖ్య చేశాడు అయ్యర్.
"నాకు చాలా సంతోషంగా. కేకేఆర్ ఫ్రాంచైజీ వల్ల నా కెరీర్ మలుపు తిరిగింది. క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. నా మీద నమ్మకం పెట్టకుని నన్ను ప్రోత్సహించిన కేకేఆర్ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. ఈ ఫ్రాంచైజీలు నాకు ఇల్లు లాంటిది. నాకు టీమ్ఇండియా తరఫున ఆడే అవకాశం రావడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ అంటే నాకెంతో ప్రత్యేకం. అక్కడ ఆడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు."
-వెంకటేశ్ అయ్యర్.
ఈ రిటెన్షన్ ప్రక్రియలో అయ్యర్‌తో పాటు సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, వరుణ్ చక్రవర్తిని కూడా అట్టిపెటుకుంది కోల్‌కతా. ఈ ముగ్గురు కూడా కేకేఆర్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఫ్రాంచైజీతో తమకున్న అనుబంధాన్ని తెలిపారు.
"కేకేఆర్‌తో మళ్లీ భాగస్వామ్యమవ్వడం గొప్పగా భావిస్తున్నాను. ఫ్రాంచైజీ ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఈ సారి ఈడెన్ గార్డెన్స్‌లో ఫ్యాన్స్ సమక్షంలో ఆడబోతుండటం ఎంతో ఎక్సైట్‌గా ఉంది. అభిమానులను,ఫ్రాంచైజీని గర్వపడేలా చేస్తామని భావిస్తున్నాను."
-వరుణ్ చక్రవర్తి.
"ఐపీఎల్లో కోల్‌కతా తరఫున మాత్రమే ఆడతా. ఈ ప్రపంచంలో కేకేఆర్‌కు మరో జట్టు ఉంటే ఆ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడానికే ప్రాధన్యత ఇస్తాను. వచ్చే సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా."
-సునీల్ నరైన్.
"గత ఎనిమిది సీజన్ల నుంచి కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీతో నా ప్రయాణం మరింత ముందుకు సాగడం సంతోషంగా ఉంది. వారు ఇన్నేళ్లుగా నా పై చూపిస్తున్న ప్రేమ, నమ్మకం, ఆత్మవిశ్వాసానికి ధన్యావాదాలు."
-ఆండ్రూ రసెల్.
"సునీల్, యాండ్రూ, వరుణ్, వెంకటేశ్‌ను రిటెయిన్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ నలుగురు ఎంతో ప్రత్యేకం. వీరు తప్పకుండా వచ్చే మూడు సీజన్లలో అద్భుతం చేస్తారని ఆశిస్తున్నాం" అని కేకేఆర్ సీఈఓ వెంకీ అన్నారు.
ఇదీ చూడండి: ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి జాబితా వచ్చేసింది.. ఎవరికి అత్యధిక ధరంటే?