ETV Bharat / sports

ఆర్​సీబీని చిత్తుచేసిన సన్​రైజర్స్​.. లీగ్​లో వరుసగా ఐదో విజయం - ఐపీఎల్​ అప్​డేట్స్​

RCB vs SRH: ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్​లో ఆర్​సీబీని 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలి రెండు మ్యాచ్​ల్లో ఓడిన ఎస్​ఆర్​హెచ్​.. తర్వాతి 5 మ్యాచ్​లు వరుసగా గెలవడం విశేషం.

Sunrisers Hyderabad won by 9 wickets
Sunrisers Hyderabad won by 9 wickets
author img

By

Published : Apr 23, 2022, 10:08 PM IST

RCB vs SRH: ఐపీఎల్​-2022లో వరుసగా ఐదో విజయం సాధించింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. శనివారం జరిగిన రెండో మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరును చిత్తుచేసింది. 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 8 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్​ శర్మ 28 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. కెప్టెన్​ కేన్​ విలియమ్సన్(16 నాటౌట్​), రాహుల్​ త్రిపాఠి(7 నాటౌట్​) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఏకైక వికెట్​ హర్షల్​ పటేల్​కు దక్కింది. ఈ విజయంతో మంచి రన్​రేట్​ సాధించిన హైదరాబాద్​.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

అంతకుముందు సన్​రైజర్స్​ బౌలర్లు చెలరేగగా.. ఆర్​సీబీ 68 పరుగులకే ఆలౌటైంది. ప్రభుదేశాయ్​(15), మాక్స్​వెల్​(12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కోహ్లీ పేలవ ఫామ్​ కొనసాగిస్తూ వరుసగా రెండో మ్యాచ్​లో గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగాడు. ఆర్​సీబీలో కోహ్లీ, అనుజ్​ రావత్​, దినేశ్​ కార్తిక్​ డకౌటయ్యారు. హైదరాబాద్​ బౌలర్లలో మార్కో జాన్సెన్​, నటరాజన్​ తలో 3 వికెట్లు తీయగా.. సుచిత్​ రెండు, భువనేశ్వర్​, ఉమ్రాన్​ మాలిక్​ చెరో వికెట్​ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.