ETV Bharat / sports

IPL 2022 సీన్ రిపీట్​.. ఇప్పుడు అలానే.. - ఐపీఎల్ 2022 గుజరాత్ ప్రదర్శన

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్​ చివరి దశకు చేరుకుంది. అయితే ఇక్కడ.. IPL 2022 జరిగిన ఓ సీన్.. తాజా సీజన్​లో రిపీట్ అయింది. ఆ వివరాలు..

IPL Gujarat Titans performance same in 2022 2023 seasons
IPL 2022 సీన్ రిపీట్​.. ఇప్పుడు అలానే..
author img

By

Published : May 22, 2023, 7:40 PM IST

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్​ చివరి దశకు చేరుకుంది. 50 రోజులకు పైగా జరిగిన ఉత్కంఠ పోరులో 70 లీగ్​ మ్యాచ్​లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్​ రేసులో ఎవరు గెలిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. గుజరాత్​ టైటాన్స్​, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్​నవూ సూపర్ జెయింట్స్​, ముంబయి ఇండియన్స్​ పోటీ పడనున్నాయి. అయితే ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన లీగ్​ మ్యాచ్​లను గమనిస్తే.. 2022 జరిగిన ఓ సీన్​.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్​లోనూ కొనసాగుతోందా అని అనిపిస్తోంది. కొన్ని గణాంకాలు చూస్తుంటే అలానే కనపడుతోంది. గుజరాత్​ టైటాన్స్​ విషయంలో ఇది జరుగుతోంది.

గత సీజన్‌లో ఛాంపియన్‌గా అవతరించిన గుజరాత్‌ టైటాన్స్​.. ఆ సీజన్​లో మొదటి మ్యాచ్​ విజయంతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుత సీజన్‌లోనూ కూడా అంతే. అదే సీన్​ను రిపీట్​ చేసింది. ఇక గత సీజన్‌లో 14 గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌.. ప్రస్తుత సీజన్‌లోనూ అన్నే మ్యాచ్‌లు ఆడింది. గత సీజన్‌లో లాగే 10 విజయాలు- 4 ఓటములను ఎదుర్కొని పాయింట్ల టేబుల్​లో నిలవడం విశేషం.

మరో విషయమేమిటంటే.. గుజరాత్‌ టైటాన్స్​.. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ టీమ్​కు సాధ్యం కాని ఓ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్‌ స్టేజీ లీగ్​ మ్యాచుల్లో.. వరుస సీజన్లలో 5 కన్నా తక్కువ మ్యాచ్‌లు ఓడిన తొలి టీమ్​గా నిలిచింది. కాగా, ఈ సీజన్​లోనూ జోరు కొనసాగిస్తున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్​.. తమ ఆఖరి లీగ్​ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరును ఓడించి.. ముంబయి ఇండియన్స్​ ప్లే ఆఫ్స్‌ చేరేలా చేసింది. గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్​ గిల్‌.. తన మెరుపు శతకంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ ఛాన్స్​లపై నీళ్లు చల్లాడు. దీంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగో టీమ్​గా ముంబయి నిలిచింది.

ప్లే ఆఫ్స్ ఇలా.. గుజరాత్‌ టైటాన్స్‌ (20 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్‌ (17 పాయింట్లు, +0.652 నెట్‌రన్‌రేట్), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (17 పాయింట్లు, +0.284 నెట్‌రన్‌రేట్), ముంబయి ఇండియన్స్‌ (16 పాయింట్లు) నాలుగు స్థానాల్లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫయర్‌-1, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లను ఆడతాయి. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న టీమ్స్​ ఎలిమినేటర్‌ మ్యాచ్​ను ఆడతాయి.

  • మే 23న గుజరాత్ టైటాన్స్‌- చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ జరుగుతుంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా ఇది జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్​ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టుకు ఇంకో ఛాన్స్ ఉంటుంది.
  • మే 24న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగుతుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్- ముంబయి ఇండియన్స్‌ టీమ్‌లు పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో ఆడుతుంది. ఇది కూడా చెపాక్‌ స్టేడియంలోనే జరుగుతుంది.
  • మే 26న క్వాలిఫయర్‌-2 నిర్వహిస్తారు. ఫస్ట్​ క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో.. ఎలిమినేటర్‌ మ్యాచ్​లో గెలిచిన జట్టు పోటీ పడాల్సి ఉంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రెండో క్వాలిఫయిర్‌ మ్యాచ్‌ జరుగుతుంది.
  • మే 28న ఫైనల్ మ్యాచ్​ జరుగుతుందిక్వాలిఫయర్‌ 1 గెలిచిన జట్టు-క్వాలిఫయర్‌ 2 గెలిచిన టీమ్​.. టైటిల్​ కోసం తలపడతాయి. నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఈ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరగనుంది.
  • ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు. స్టార్‌స్పోర్ట్స్‌లోనూ చూసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: Bichagadu 2 Collections : 'బిచ్చగాడు 2' జోరు.. ఫస్ట్ వీకెండ్​ కలెక్షన్స్​ అదుర్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.