ETV Bharat / sports

కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌.. IPL కోసం అదిరే మేకోవర్.. స్టైలిష్ట్ ఎవరో తెలుసా? - ఐపీఎల్​ 2023 కోహ్లీ మేకోవర్​

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​ ముగిసిన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని కోహ్లీ తన మేకోవర్ కోసం కేటాయించాడు. ప్రస్తుతం అతడి కొత్త హెయిర్ స్టైల్ యువతను, ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

ipl 2023 virat kohli
ipl 2023 virat kohli
author img

By

Published : Mar 25, 2023, 2:11 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ.. ఎప్పటికప్పుడు సరికొత్త హెయిర్​ స్టైల్​తో ఆకట్టుకుంటూ ఉంటాడు. ప్రతీ సిరీస్​కు ముందు న్యూ హెయిర్​ స్టైల్​ చేయించుకుంటాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని విరాట్​ తన మేకోవర్ కోసం కేటాయించాడు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్​ కోసం అదిరే మేకోవర్​లో దర్శనమిచ్చాడు. కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ యువతను, ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

విరాట్​ కోహ్లీకి అతడి ఆటతీరు వల్లే కాకుండా.. హెయిర్​ స్టైల్ వల్ల కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్టు కోహ్లీ కూడా ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ, మంచి లుక్ మెయింటైన్ చేస్తుంటాడు. అతడి హెయిర్​ స్టైల్‌ను చాలా మంది ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం విరాట్​ కొత్త హెయిర్​ స్టైల్​ సోషల్ మీడియాలో ఫుల్​ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ కోహ్లీకి హెయిర్ స్టైలింగ్ చేసింది ఎవరో తెలుసా?

కోహ్లీకి హెయిర్​ స్టైల్​ చేసింది ఎవరో కాదు.. సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలిం హకీం. మన దేశంలో టాప్ సెలెబ్రిటీలకు అతడే హెయిర్ స్టైలింగ్ చేస్తుంటాడు. టాలీవుడ్‌కు చెందిన స్టార్​ హీరోలు రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్​కు కూడా అతడే హెయిర్ స్టైలింగ్ చేస్తుంటాడు. అతడి ఫీజు కూడా మామూలుగా ఉండదు. లక్షల రూపాయల్లో ఉంటుంది. కోహ్లీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను అతడే ముందు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. తర్వాత విరాట్​ కూడా ఫ్యాన్స్​తో పంచుకున్నాడు.

ipl 2023 virat kohli
విరాట్​ కోహ్లీ, ఆలిం హకీం
ipl 2023 virat kohli
విరాట్​ కోహ్లీ, ఆలిం హకీం

కొత్త మేకోవర్‌తో ఆకట్టుకుంటున్న కోహ్లీ.. మరో వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్యాష్​ రిచ్​ లీగ్​ ప్రారంభానికి ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మార్చి 26న జరిగే రాయల్ ఛాలెంజర్స్ అన్‌బాక్స్ ఈవెంట్‌లో కోహ్లీ పాల్గొనున్నాడు. ఆ ఈవెంట్​కు ఇద్దరు దిగ్గజ ఐపీఎల్ ఆటగాళ్లు క్రిస్​ గేల్​, డివిలియర్స్​ కూడా రానున్నారు.

ఐపీఎల్​ 16వ సీజన్​లో బెంగళూరు జట్టు.. తమ తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది. చెన్నై చిన్నస్వామి స్డేడియంలో ఏప్రిల్​ 2న ఈ మ్యాచ్​ జరగనుంది. గత సీజన్​లో ఆర్సీబీ టీమ్​ వరుస పరాజయాలతో అభిమానుల్ని నిరాశపరిచింది. దీంతో ఈసారైనా బెంగళూరు జట్టు అంచనాలకు తగ్గట్టు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.