ETV Bharat / sports

ఓ వరుణుడా.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా?.. ఫైనల్​ మ్యాచ్​ వాయిదా - ఫైనల్​ మ్యాచ్ వాయిదా

IPL 2023 Final CSK VS GT : ఐపీఎల్ 2023 ఫైనల్​ మ్యాచ్​లో వర్షం దోబుచులాడుతోంది. మ్యాచ్​ ప్రారంభ సమయం దాటి మూడుగంటలకుపైగా అయినా ఇంకా కొలిక్కిరాలేదు. దీంతో మే 29కు ఫైనల్​ మ్యాచ్​ను వాయిదా వేశారు.

IPL 2023 Final CSK Fans worried if match abandoned rain Gujarat win title
ఓ వరుణుడా.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా.. బాధైతుంది!
author img

By

Published : May 28, 2023, 10:23 PM IST

Updated : May 28, 2023, 11:06 PM IST

IPL 2023 Final CSK VS GT : అభిమానుల కేరింతలు, ఈలలు, సంబరాలు మధ్య జరగాల్సిన ఐపీఎల్​ను​.. కరోనా వల్ల గత మూడేళ్ల పాటు సింపుల్​గా నిర్వహించేశారు. స్టేడియాల్లో ప్రేక్షకులను అనుమతించలేదు. గతేడాది పరిమిత స్థాయిలో మాత్రమే అనుమతించారు. ఆ సమయంలో ప్లేయర్స్​తో పాటు ఆడియెన్స్​ కాస్త నిరాశగానే ఉన్నారు. కానీ ఈ సారి మాత్రం అలా కాదు. ప్రారంభోత్సవ వేడుకలు, ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అనుమతి.. ఎటువంటి ఆంక్షలు లేకుండా నిర్వహించారు. అలానే అభిమానుల కేరింతలు, ఈలలు మధ్య సీజన్ మొత్తం సాగింది. ఐపీఎల్‌ హిస్టరీలోనే అత్యధిక మంది వీక్షించిన సీజన్‌గానూ ఈ సీజన్​ నిలిచింది. అన్ని మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా సాగాయి. ముఖ్యంగా ధోనీ కోసం అభిమానులు బారులు తీరారు.

అలా దాదాపు రెండు నెలల పాటు అభిమానులను ఊర్రూతలూగిస్తూ సాఫీగా సాగిన టోర్నీలో.. అసలు సిసలైన ఫైనల్​ పోరు కోసం మరింత ఉత్కంఠగా ఎదురుచూశారు అభిమానులు. ఆదివారం(మే 28న) తుదిపోరులో.. సీఎస్కే ఐదోసారి ట్రోఫీని ముద్దాడుతుందా.. లేదంటే గుజరాత్‌ వరుసగా రెండోసారి కప్​ను కొడుతుందా అని ఆసక్తితో ఉన్నారు. కానీ అభిమానుల ఆశలపై వరుణ దేవుడు నీళ్లు చల్లాడు.

మ్యాచ్​ వాయిదా...

IPL 2023 Final CSK VS GT Rain: అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్​కు అడ్డంకిగా నిలిచాడు. ఈ తుది పోరును వీక్షించాలని మధ్యాహ్నం నుంచే స్టేడియం వద్ద బారులు తీరిన ప్రేక్షకులకు, టీవీలకు అతుక్కుపోయిన ఆడియెన్స్​ను నిరాశపరిచాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాడు. ఈ వర్షం వల్ల టాస్‌ కూడా ఆలస్యం అయింది. మ్యాచ్ సమయానికి మూడు గంటలు దాటినా.. వర్షం జోరు మాత్రం తగ్గడం లేదు. దీంతో అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్​ను మే 29కు(సోమవారం) వాయిదా వేశారు.

అయితే సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ రిజర్వ్​ డే కూడా మ్యాచ్ జరగకపోతే.. టైటిల్​ విజేతను ప్రకటిస్తారు. అదే కనుక జరిగితే లీగ్‌లో టాపర్‌గా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్​కు ఇబ్బందేమి లేదు. విజేతగా నిలుస్తుంది. కానీ చెన్నైకు పెద్ద నష్టమనే చెప్పాలి. అసలే సీఎస్కే కెప్టెన్​ ధోనీకి చివరి ఐపీఎల్‌ అని భావిస్తున్న తరుణంలో.. వర్షం కారణంగా ఇలా జరిగితే మాత్రం సీఎస్కే అభిమానులు తీవ్ర నిరాశకు గురౌతారు. ఇప్పటికే సోషల్​మీడియాలో.. నెటిజన్లు.. ఈ సీజన్‌లో ఏ మ్యాచ్‌కు అడ్డుపడని వరుణుడు.. ఫైనల్​కు మాత్రం ఎందుకు అడ్డుపడ్డాడు అంటూ ఫీలైపోతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో..

  • The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.

    Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD

    — IndianPremierLeague (@IPL) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

IPL Final : భారీ వర్షంతో మ్యాచ్​కు అంతరాయం.. విజేతను ఎలా ప్రకటిస్తారంటే?

ఐపీఎల్ ఫైనల్​కు ముందు షాకింగ్ న్యూస్.. CSK కీలక ప్లేయర్ రిటైర్మెంట్​

Last Updated : May 28, 2023, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.