IPL 2023 Awards Winners List : వరుణుడి వేటలో గుజరాత్, చెన్నై మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జడ్డూ మెపురు షాట్లు ఆడాడు. దీంతో చెన్నై ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో అవార్డులు రివార్డులు అందుకున్న ప్లేయర్లు, టీమ్‌లు ఇవే..
టీమ్‌ల ప్రైజ్‌మనీ..
ఐపీఎల్ టీమ్‌ల ప్రైజ్‌మనీ పూల్ మొత్తం రూ.46.5 కోట్లు. అందులో రూ. 20 కోట్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రన్నరప్ ప్రైజ్‌మనీ రూ. 13 కోట్లను గుజరాత్ జట్టు సొంతం చేసుకుంది. ఇక, క్వాలిఫయర్-2లో ఓడిపోయిన ముంబయి జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుని రూ.7 కోట్లు వెనకేసింది. నాలుగో స్థానంలో ఉన్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.6.5 కోట్లు సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2023 అవార్డులు, రివార్డులు..
ఐపీఎల్ ప్రతి సీజన్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ఐపీఎల్ 16వ సీజన్లో చాలా వరకు మ్యాచ్‌లు ఫైనల్ మ్యాచ్‌లా ఉత్కంఠగానే సాగాయి. ప్లేయర్లు గతంలో నమోదైన రికార్డులను బద్దలుగొట్టారు. ఐపీఎల్ చరిత్రలో నయా రికార్డులు నెలకొల్పారు. ఓ వైపు ఐపీఎల్ అరంగేట్రం చేసిన యుంగ్ ప్లేయర్లు అదరగొడితే.. మరో వైపు జడేజా, విరాట్ కోహ్లీ, యుజువేంద్ర చాహల్, ఎంఎస్ ధోనీ లాంటి సీనియర్ ఆటగాళ్లూ ఆకట్టుకున్నారు. అలా ఈ సీజన్లో తమ అద్భుత ప్రదర్శనతో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ప్లేయర్లు వీరే.
- విన్నర్ : చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 20 కోట్లు
- రన్నరప్ : గుజరాత్ టైటాన్స్ - రూ. 13 కోట్లు
- మూడో స్థానం : ముంబయి ఇండియన్స్ - రూ. 7 కోట్లు
- నాలుగో స్థానం : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ - రూ. 6.5 కోట్లు
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ : యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్) - రూ. 10 లక్షలు
- ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది టోర్నమెంట్ : గ్లెన్ మాక్స్‌వెల్ (బెంగళూరు) - రూ. 10 లక్షలు
- గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ : శుభమన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – రూ. 10 లక్షలు
- సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు : శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – రూ. 10 లక్షలు
- సీజన్‌లో అత్యధిక ఫోర్లు : శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – రూ. 10 లక్షలు
- సీజన్‌లో లాంగెస్ట్ సిక్సర్లు : ఫాఫ్ డుప్లెసిస్ (బెంగళూరు) - రూ. 10 లక్షలు
- క్యాచ్ ఆఫ్ ది సీజన్ : రషీద్ ఖాన్ (గుజరాత్ టైటాన్స్) – రూ. 10 లక్షలు
- ఫెయిర్‌ప్లే అవార్డు : దిల్లీ క్యాపిటల్స్ – రూ. 10 లక్షలు
- పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు ) : మహ్మద్ షమి (గుజరాత్ టైటాన్స్) – రూ. 10 లక్షలు
- ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగుల) : శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – రూ. 10 లక్షలు
- సీజన్‌లో అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ : ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం – రూ. 50 లక్షలు
-
A Super Dad and a Super Duper CHAMPION!📸💛#WhistlePodu #Yellove 🦁@imjadeja pic.twitter.com/bAxugJxv4F
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A Super Dad and a Super Duper CHAMPION!📸💛#WhistlePodu #Yellove 🦁@imjadeja pic.twitter.com/bAxugJxv4F
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023A Super Dad and a Super Duper CHAMPION!📸💛#WhistlePodu #Yellove 🦁@imjadeja pic.twitter.com/bAxugJxv4F
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023