ETV Bharat / sports

IPL 2023 DC VS SRH :వరుస ఓటములతో ఆరెంజ్​ టీమ్​.. 145 కొట్టలేక!

తమ బౌలింగ్​ స్కిల్స్​తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేశారు. దిల్లీ అతి కష్టం మీద 144 పరుగులను స్కోర్​ చేయగలిగింది. సునాయాసంగా ఛేదించగల లక్ష్యమిది. కానీ బ్యాట్స్‌మెన్​ల ఘోర వైఫల్యంతో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌కు మరోసారి పరాభవం తప్పలేదు. బౌలర్ల పోరాటంతో దిల్లీ క్యాపిటల్స్‌ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. అయిదు ఓటముల తర్వాత వరుసగా తమ ఖాతాలోకి రెండో విజయాన్ని వేసుకుంది. సన్‌రైజర్స్‌ చేజేతులా మ్యాచ్‌ను సమర్పించుకుని.. వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది.

Sunrisers Hyderabad vs Delhi Capitals
Sunrisers Hyderabad vs Delhi Capitals
author img

By

Published : Apr 24, 2023, 10:57 PM IST

Updated : Apr 25, 2023, 6:37 AM IST

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్​లో ఆరెంజ్​ టీమ్​కు వరుస ఓటములు తప్పడం లేదు. దూకుడు, పోరాట స్ఫూర్తి లాంటివి కొరవడిన ఆ జట్టు.. ఈ సీజన్లో అయిదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో సోమవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 7 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ జట్టు.. నిర్దిష్ట 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులనే స్కోర్​ చేయగలిగింది. అయితే ఆ జట్టు సభ్యులైన మనీశ్​ పాండే, అక్షర్‌ పటేల్‌ మైదానంలో పోరాడారు. సన్​రైజర్స్​ నుంచి దిగిన భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కూడా గొప్పగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థులను కట్టడి చేశారు. అయితే సన్‌రైజర్స్‌ బ్యాటర్లు మరింత పేలవంగా ఆడటం వల్ల.. ఇక ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. మొదట్లో మయాంక్‌ అగర్వాల్‌.. చివర్లో హెన్రిచ్‌ క్లాసెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ పోరాడినప్పటికీ ఆ జట్టును విజయం వరించలేదు. నోకియా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మ ఇలా వీరందరూ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దిల్లీని గెలిపించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి బ్యాటింగ్​లో​ మనీష్ పాండే(34), అక్సర్​ పటేల్​(34) రాణించారు. 8 ఓవర్లకు 62/5తో కష్టాల్లో పడిన దిల్లీకి తోడుగా నిలిచారు. నిలకడగా సింగిల్స్​ తీస్తూ స్కోరు బోర్డును ముందుకు నెట్టారు. కెప్టెన్ వార్నర్​(21), మిచెల్ మార్ష్​(25) నామమాత్రపు పరుగులు చేశారు. మిగతా వారు ఫెయిల్ అయిపోయారు. సన్​రైజర్స్ హైదబాద్​ బౌలర్లలో వాషింగ్టన్​ సుందర్ మూడు వికెట్లతో మెరవగా.. భువనేశ్వర్​ కుమార్​ 2, టి నటరాజన్​ ఓ వికెట్​ తీశారు.

కాళ్లు మొక్కిన వార్నర్​.. ఉప్పల్​ వేదికగా సోమవారం జరిగిన మ్యాచులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కాళ్లు మొక్కాడు(సరదాగా). టాస్ అనంతరం ఇలా చేశాడు. ఆ తర్వాత అతడిని కౌగిలించుకున్నాడు. వీరిద్దరు చాలా ఏళ్ల పాటు సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. వార్నర్ సన్‌రైజర్స్​కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. భువనేశ్వర్ కుమార్ అతడికి డిప్యూటీగా ఉన్నాడు. అలా వీరి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇకపోతే దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన ట్విటర్​లో షేర్ చేయగా అది కాస్త వైరల్​గా మారింది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి: భువనేశ్వర్ రికార్డ్​.. వాషింగ్టన్​ సుందర్ అద్భుత ప్రదర్శన​.. దిల్లీ బ్యాటింగ్ ఢమాల్​

Last Updated : Apr 25, 2023, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.