ETV Bharat / sports

IPL 2022: ముంబయికి షాక్​.. రోహిత్​కు భారీ జరిమానా

Rohit Sharma fined IPL 2022: పంజాబ్​ కింగ్స్​తో మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్​ కారణంగా ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మకు జరిమానా పడింది. మ్యాచ్​ ఫీజులో రూ.24 లక్షల కోత విధించారు. అయితే ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్​ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు.

Rohit Sharma
రోహిత్​ శర్మ
author img

By

Published : Apr 14, 2022, 8:45 AM IST

Updated : Apr 14, 2022, 9:36 AM IST

Rohit Sharma fined IPL 2022: ఐపీఎల్​ మెగా లీగ్​ 15వ సీజన్​ రసవత్తరంగా సాగుతోంది. బుధవారం పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ ముంబయి ఇండియన్స్​ ఓడిపోయింది. 12 పరుగుల తేడాతో పరాజయం పొందింది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైంది. అయితే.. ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మకు షాక్​ తగిలింది. స్లో ఓవర్​ రేట్​ కారణంగా అతడికి జరిమానా పడింది. మ్యాచ్​ ఫీజులో రూ.24 లక్షలు కోత విధించారు. మిగతా జట్టు సభ్యులకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్​ ఫీజులో 25 శాతం(ఏది తక్కువైతే అది) కోత పెట్టారు.

ఐపీఎల్​ 15వ సీజన్​లో స్లో ఓవర్​ రేటు కారణంగా ముంబయికి జరిమానా పడటం ఇది రెండోసారి. అంతకు ముందు ఈ సీజన్​లో మార్చి 27న తొలి మ్యాచ్​ దిల్లీ క్యాపిటల్స్​పై ముంబయి ఇండియన్స్​ ఆడింది. ఈ మ్యాచ్​లోనూ స్లో ఓవర్​ రేట్​ కారణంగా రోహిత్​కు జరిమానా పడింది. మ్యాచ్​ ఫీజులో రూ.12 లక్షలు కోత విధించారు.

Rohiths sharma 10 thousand runs: ఈ మ్యాచ్​లో టీమిండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ మరో అరుదైన రికార్డ్​ సాధించాడు. టీ20 క్రికెట్​లో 10వేల పరుగులు చేసిన రెండో భారతీయుడిగా.. ఓవరాల్​గా ఏడో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్​ 15వ సీజన్​లో బుధవారం పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఈ ఫీట్​ అందుకున్నాడు రోహిత్​. ​16 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. రోహిత్​ కన్నా ముందు టీమిండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్​గో ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్​ బాస్ క్రిస్​ గెయిల్​ మొదటి స్థానంలో ఉన్నాడు.

MI skipper Rohit Sharma
టీ20ల్లో అత్యధిక పరుగుల వీరులు

మంచి క్రికెట్​ ఆడటం లేదు: పంజాబ్​ కింగ్స్​ చేతిలో ఓటమిపాలైన తర్వాత మాట్లాడిన ముంబయి కెప్టెన్​ రోహిత్​ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము కొంత కాలంగా మంచి క్రికెట్​ ఆడటం లేదని, అందుకే ఓడిపోతున్నామని పేర్కొన్నాడు. 'కొంత కాలంగా మంచి క్రికెట్​ ఆడటం లేదు. అందుకే ఓటమి వైపు ఉన్నాం. పంజాబ్​ కింగ్స్​ బ్యాటింగ్​లో మా బౌలర్లపై ఒత్తిడి పెంచింది. తొలి వికెట్​కే 90-100 మధ్య భాగస్వామ్యం నెలకొల్పగలిగింది. బ్యాటింగ్​కు అనుకూలిస్తున్న ఈ పిచ్​పై 190 ఛేదించగల లక్ష్యంగా ఊహించాను. జట్టుగా ఏం చేయలేదానిపై ఆత్మపరిశీలన చేసుకుంటాం.' అని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: 'కెప్టెన్సీ ఒత్తిడితోనే ఐపీఎల్​లో రోహిత్​ శర్మ విఫలం'

Last Updated : Apr 14, 2022, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.