యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ టీ20లో (IPL 2021) ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కీలక మైలు రాయిని దాటాడు. మంగళవారం షేక్ జాయెద్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ వికెట్ తీసిన ఈ వెస్టిండీస్ ఆటగాడు.. టీ20 మ్యాచ్‌ల్లో 300 వికెట్లు (Pollard Ipl Wickets) మార్క్‌ను చేరుకున్నాడు. అంతేగాకుండా ఈ ఫార్మాట్లో 10,000 పరుగులు చేసి 300 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా పొలార్డ్ రికార్డులకెక్కాడు.
పొలార్డ్ కంటే ముందు 300 వికెట్లు తీసిన వారు 10 మంది ఉన్నారు.. బ్రావో 546 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇమ్రాన్ తాహిర్(420), సునీల్ నరైన్(418), మలింగ(390) వికెట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పొలార్డ్ ఎంపికయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన 300వ వికెట్ తీయడం ప్రత్యేకమని అన్నాడు. అందులోనూ ఆ వికెట్ కేల్ రాహుల్‌ది కావడం మరింత మజాని ఇచ్చిందని పేర్కొన్నాడు. తన జట్టుకు అవసరమైన సమయంలో రాణించడం నాకు మరింత ఆనందాన్ని ఇస్తుందని చెప్పాడు. ఇందుకోసం ఎలా ఆడాలో తనకు తెలుసునని వివరిచించాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇదీ చూడండి: ఎట్టకేలకు ముంబయికి విజయం.. ప్లే ఆఫ్స్ రేసులో!