ETV Bharat / sports

ఐపీఎల్​ స్థాయి వేరు: పాక్​ పేసర్​

author img

By

Published : May 16, 2021, 5:31 AM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సాటి రాగల క్రికెట్‌ లీగ్ ప్రపంచంలోనే మరొకటి లేదని పాక్ పేసర్‌ వాహబ్‌ రియాజ్‌ అన్నాడు. పాకిస్థాన్​ సూపర్​ లీగ్​తో దానిని పోల్చలేమని చెప్పాడు.

ipl
ఐపీఎల్​

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​పై పాక్ క్రికెటర్​ వాహబ్​ రియాజ్ ప్రశంసలు కురిపించాడు​. ఈ మెగాటోర్నీని మించిన లీగ్​ మరొకటి ఉండదని అన్నాడు. ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ క్రికెట్​ లీగ్​ అని పేర్కొన్నాడు. పీఎస్​ఎల్​తో పోలిస్తే ఐపీఎల్​ స్థాయి వేరు అని చెప్పాడు.

"అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్లు ఐపీఎల్‌ ఆడతారు. పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చకూడదు. దాని స్థాయి వేరు. ఐపీఎల్​ నిర్వాహకుల అంకితభావం, నిర్వహణ సామర్థ్యం, కమ్యూనికేషన్స్‌, ఆటగాళ్ల ఎంపిక అంతా భిన్నంగా ఉంటుంది. అందుకే దాని స్థాయి వేరు. ఐపీఎల్‌ తర్వాత స్థానం మాత్రం పీఎస్‌ఎల్‌దే. ఇందులో ఉన్న బౌలింగ్‌ ప్రమాణాలు ఐపీఎల్​తో సహా​ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవు. బౌలింగ్​ దాడి వల్ల ఎక్కువ భారీ స్కోరు మ్యాచ్​లు ఇందులో ఉండవు. ఈ రెండు లీగ్​లకు బౌలింగ్​ దాడి ఒక్కటి మాత్రమే తేడా" అని రియాజ్​ చెప్పాడు.

​​ప్రస్తుతం ఐపీఎల్​, పీఎస్​ఎల్​ కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడ్డాయి. మిగిలినా మ్యాచ్​లను జూన్​, సెప్టెంబరులో నిర్వహిస్తారని ప్రచారం సాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.