ETV Bharat / sports

'బంతికోసం ఫిలిప్స్​ పరుగులు.. ఆశ్చర్యపోయిన సామ్​'

author img

By

Published : Oct 3, 2021, 12:32 PM IST

Updated : Oct 3, 2021, 12:38 PM IST

శనివారం(అక్టోబర్​ 2) రాత్రి జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​.. ఛేదనలో అద్భుతంగా రాణించి చెన్నై సూపర్​ కింగ్స్​పై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో ఓ హాస్యభరితమైన సంఘటన జరిగింది. సామ్​కరన్​(Glenn Phillips Sam curran) వేసిన వైడ్ బంతి కోసం ఫిలిప్స్(Glenn Phillips IPL)​ పరుగులు తీయడం నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

philips
ఫిలిప్స్

శనివారం(అక్టోబర్​ 2) జరిగిన మ్యాచ్​లో చెన్నైని(CSK vs RR) అలవోకగా ఓడించింది రాజస్థాన్ రాయల్స్​. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవం చేసుకుంది. అయితే.. ఈ పోరు​ జరుగుతుండగా ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ​

17వ ఓవర్​లో సామ్​ కరన్(Glenn Phillips Sam Curran) వేసిన రెండో బంతి చేతినుంచి జారిపోయి వైడ్ దిశగా పైకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆ బంతిని కూడా ఉపయోగించుకోవాలని ప్రయత్నించాడు స్ట్రైక్​లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్(Glenn Philips IPL). వేగంగా పరుగెత్తినప్పటికీ ఆ బంతిని అందుకోలేకపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ పెడుతున్నారు. 'ఏంటి ఫిలిప్స్ అంత దూరం వెళ్తున్న బంతిని కూడా విడిచిపెట్టవా..?' అని ఓ నెటిజన్​ కామెంట్ చేయగా... 'ఫిలిఫ్స్​​ ఆరాటం చూసి సామ్​ కరన్ నోరెళ్లబెట్టాడు' అంటూ మరో నెటిజన్ స్పందించాడు.

ధనాధన్ ఛేదన..

మూడు వరుస ఓటముల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌(rajasthan royals team 2021) విజయాన్నందుకుంది. యశస్వి జైశ్వాల్‌ (50; 21 బంతుల్లో 6×4, 3×6), శివమ్‌ దూబే (64 నాటౌట్‌; 42 బంతుల్లో 4×4, 4×6) చెలరేగడం వల్ల 7 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (101 నాటౌట్‌; 60 బంతుల్లో 9×4, 5×6) విధ్వంసం సృష్టించడం వల్ల మొదట చెన్నై 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. జడేజా (32 నాటౌట్‌; 15 బంతుల్లో 4×4, 1×6) మెరిశాడు. జైశ్వాల్‌, దూబేల భీకర బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఐపీఎల్‌-14 యూఏఈ అంచెలో చెన్నైకి ఇదే తొలి ఓటమి.

ఇదీ చదవండి:

దంచికొట్టిన రాజస్థాన్‌.. ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవం

IPL 2021: 'అతడిని చూసి భయపడ్డాం'

Last Updated : Oct 3, 2021, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.