Women's IPL from 2023 Looks Uncertain: వచ్చే ఏడాది నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతుందనుకున్న క్రికెట్ అభిమానులకు చేదు వార్త! 2023 నుంచే మహిళల ఐపీఎల్ ప్రారంభించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశిస్తుండగా, నాణ్యమైన ప్లేయర్లు లేని కారణంగా అది సాధ్యపడకపోవచ్చని బోర్డులోని ఓ వర్గం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
"మహిళల క్రికెట్‌ను ప్రోత్సాహించేందుకు బీసీసీఐ తగినంత కృషి చేస్తోంది. అయితే మహిళల క్రికెట్లో ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి మహిళల లీగ్ ప్రారంభించడం అసాధ్యంగా కనబడుతోంది"
-ఓ బీసీసీఐ అధికారి
ఐపీఎల్ తరహా లీగ్‌లకు కనీసం నాలుగైదు జట్లు కావాలని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. "ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లతో 4-5 నాణ్యమైన జట్లను తయారు చేయడం కష్టం. పురుషుల క్రికెట్లో ఉన్న టాలెంట్ స్థాయికి చేరాలంటే ఏళ్లు పడుతుంది. కొన్నేళ్లుగా మహిళల క్రికెట్.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్కువ మంది ప్లేయర్లను అందించలేకపోయింది. పురుషుల జట్లులో చూస్తే ఒకరి స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ, మహిళల క్రికెట్లో తగినంత మంది నాణ్యమైన ఆటగాళ్లు లేరు." అని ఆ అధికారి అన్నారు. ఉదాహరణకు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న ఝులన్ గోస్వామి స్థాయిలో ప్రతిభ ఉన్న ప్లేయర్ మనకు ఇప్పటివరకు లేరని చెప్పారు.
ఇదీ చూడండి: మహిళల ఐపీఎల్‌పై గంగూలీ క్లారిటీ.. 'అప్పుడైతేనే కరెక్ట్'