ETV Bharat / sports

ఐపీఎల్​లో మళ్లీ కరోనా కలవరం- ఐసోలేషన్​లోకి దిల్లీ హెడ్​కోచ్​ పాంటింగ్​ - రికీ పాంటింగ్​

Delhi capitals Covid positive: ఐపీఎల్​లో మరోమారు కరోనా కలకలం రేపుతోంది. దిల్లీ క్యాపిటల్స్​ ప్రధాన కోచ్​ రికీ పాంటింగ్​ కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్​గా తేలగా ఐసోలేషన్​కు వెళ్లారు. రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​కు హెడ్​కోచ్​ లేకుండానే బరిలోకి దిగనుంది డీసీ.

Ricky Ponting
దిల్లీ హెడ్​కోచ్​ పాంటింగ్
author img

By

Published : Apr 22, 2022, 6:12 PM IST

Delhi capitals Covid positive: ఐపీఎల్​ 15వ సీజన్​లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు దిల్లీ క్యాపిటల్స్​​ జట్టు ఆటగాళ్లు వైరస్​ బారినపడగా.. తాజాగా ఆ జట్టు హెడ్​కోచ్​ రికీ పాంటింగ్​ కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్​గా తేలింది. దీంతో పాంటింగ్ ఐసోలేషన్​కు వెళ్లాడు. రాజస్థాన్​ రాయల్స్​ జట్టుతో శుక్రవారం జరిగే మ్యాచ్​కు దూరం కానున్నాడు పాంటింగ్​.

ఆర్​ఆర్​తో మ్యాచ్​ నేపథ్యంలో గురువారం ఏప్రిల్​ 21న, శుక్రవారం ఏప్రిల్​ 22న దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాళ్లు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో రికీ పాంటింగ్​కు రెండుసార్లు నెగిటివ్​గా తేలింది. అయితే.. అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్​గా తేలటం వల్ల ఐదురోజుల క్వారంటైన్​కు వెళ్లాల్సి వచ్చింది. కొవిడ్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా పేర్కొంది డీసీ. పాంటింగ్​ కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్​కు తరలించారు.

Delhi Capitals
దిల్లీ క్యాపిటల్స్​ జట్టు

"దిల్లీ క్యాపిటల్స్​ హెడ్​కోచ్​ రికీ పాంటింగ్​ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్​కు తరలించారు. పాంటింగ్​కు నిర్వహించిన రెండు టెస్టుల్లో నెగిటివ్​ వచ్చింది. జట్టును దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం, మెడికల్​ టీమ్​.. పాంటింగ్​ను ఐదురోజుల ఐసోలేషన్​కు తరలించాలని నిర్ణయించింది. రాజస్థాన్​ రాయల్స్​తో జరిగే ఇవాళ్టి మ్యాచ్​కు పాంటింగ్​ దూరంకానున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పాంటింగ్​ కుటుంబానికి అండగా నిలవాలి. ఇప్పటి వరకు బయోబబుల్​లో ఉండి పాజిటివ్​గా తేలినవారిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రతిఒక్కరు త్వరగా కోలుకునేందుకు జట్టు కృషి చేస్తోంది."

- దిల్లీ క్యాపిటల్స్ ప్రకటన.

కరోనా కలవరంతో ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య మ్యాచ్​ వేదికను పుణెలోని ఎంసీఏ మైదానం నుంచి ముంబయిలోని వాంఖెడే స్టేడియానికి మార్చింది బీసీసీఐ. మిచెల్​ మార్ష్​, టిమ్​ సేఫెర్ట్ వంటి విదేశీ ఆటగాళ్లు​ సహా మొత్తంగా ఆరుగురికి కరోనా పాజిటివ్​గా తేలిన క్రమంలో దిల్లీ క్యాపిటల్స్​ జట్టులోని వారికి ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇర్ఫాన్ పఠాన్-​ అమిత్​ మిశ్రా ట్విట్టర్​ వార్​.. కారణమేంటి?

ముంబయిలోనూ 'ధోనీ' మేనియా.. సింహం ఎక్కడైనా సింహమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.