రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డాషింగ్ ఓపెనర్ జాస్ బట్లర్.. యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న ఐపీఎల్ రెండో దశకు అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది.
బట్లర్ భార్య లూయిస్.. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పుడు ఆమెకు తోడుగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు బట్లర్.
-
Jos Buttler will not be part of the remainder of #IPL2021, as he and Louise are expecting a second child soon.
— Rajasthan Royals (@rajasthanroyals) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
We wish them well, and can't wait for the newest member of the #RoyalsFamily. 💗 pic.twitter.com/rHfeQTmvvg
">Jos Buttler will not be part of the remainder of #IPL2021, as he and Louise are expecting a second child soon.
— Rajasthan Royals (@rajasthanroyals) August 21, 2021
We wish them well, and can't wait for the newest member of the #RoyalsFamily. 💗 pic.twitter.com/rHfeQTmvvgJos Buttler will not be part of the remainder of #IPL2021, as he and Louise are expecting a second child soon.
— Rajasthan Royals (@rajasthanroyals) August 21, 2021
We wish them well, and can't wait for the newest member of the #RoyalsFamily. 💗 pic.twitter.com/rHfeQTmvvg
ఐపీఎల్-2021 తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్‌లో బట్లర్ 64 బంతుల్లో 124 పరుగులు చేశాడు.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఈ మెగా లీగ్ రెండో దశ ప్రారంభంకానుంది. పలు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని కసరత్తు షురూ చేశాయి.
ఇదీ చూడండి: IPL 2021 : ఆర్సీబీలో భారీ మార్పులు.. జట్టుకు కొత్త కోచ్!