ETV Bharat / sports

IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ.. ట్రోల్ చేస్తున్న అభిమానులు..! - ipl 2023 venue

ప్రతిష్టాత్మక ఐపీఎల్​ 2023 సీజన్​ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లఖ్‌నవూ సూపర్​ జెయింట్స్​ టీమ్​ మంగళవారం తమ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. ఈ కార్యక్రమంలో కేఎల్​ రాహుల్‌, గౌతమ్‌ గంభీర్‌, జై షా తదితరులు పాల్గొన్నారు.

lucknow super giants new jersey
lucknow super giants
author img

By

Published : Mar 7, 2023, 7:40 PM IST

ఐపీఎల్​ 2023 సీజన్​ కోసం లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ టీమ్​ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. మొదటి సీజన్‌లో టర్కోయిష్‌ బ్లూ గ్రీన్‌లో ఉన్న జెర్సీలను ధరించిన జట్టు సభ్యులు.. ఈసారి ముదురు నీలం రంగు జెర్సీలు వేసుకుని మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. మంగళవారం జరిగిన ఓ ఈవెంట్​లో ఈ కొత్త జెర్సీని లఖ్​నవూ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్‌ గోయెంకా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా, లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, మెంటార్‌ గౌతమ్​​ గంభీర్​ పాల్గొన్నారు.

"కొత్త రంగు.. నూతనోత్సాహం.. కొంగొత్త ఆశలు.. సరికొత్త శైలి" అనే క్యాప్షన్​తో విడుదలైన ఈ జెర్సీ పై అభిమానులు సామాజిక వేదికలో కామెంట్లు పెడుతున్నారు. "కొత్త జెర్సీ చూసిన తర్వాత పాత జెర్సీపై మమకారం పెరిగిపోయింది. ఎందుకంటే.. కొత్తది మరీ చెత్తగా ఉంది" అంటూ సోషల్​ మీడియా వేదికగా భారీ సెటైర్లు వేస్తున్నారు. మరి కొందరేమో 'దిల్లీ క్యాపిటల్స్‌ 2013 జెర్సీతో పోలుస్తూ దానికి దీనికి పెద్దగా తేడా ఏం లేదంటూ' డిజైనర్​ను తిట్టి పోస్తున్నారు.

'స్ట్రైక్​ రేట్​పై అతిగా అంచనా వేస్తున్నారు'..
కాగా త్వరలో ఐపీఎల్​ మొదలు కానున్న వేళ టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్‌రేట్‌పై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. దీనిపై టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ ప్రత్యేకంగా స్పందించాడు. స్ట్రైక్‌రేట్‌పై అందరూ అతిగా అంచనా వేస్తున్నారని వ్యాఖ్యానించాడు. "ఫార్మాట్‌ ఏదైనా సరే స్ట్రైక్‌రేట్‌ కీలకమే. కానీ, దానినే ఆధారంగా చేసుకుని అతిగా చెప్పడం సరైంది కాదు. ఇదే మాట గతంలోనూ చెప్పా. పరిస్థితిని బట్టి స్ట్రైక్​రేట్​ మారిపోతూ ఉంటుంది. మీరు ఒక మ్యాచ్‌లో 140 పరుగులనే ఛేదించాల్సి వచ్చిందనుకోండి.. అప్పుడు 200 స్ట్రైక్‌రేట్‌ అవసరం లేదు. అందుకే, మ్యాచ్‌ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ దూకుడుగా చేయాల్సి ఉంటుంది" అని చెప్పాడు.

మరోవైపు గత కొంత కాలంగా భారత్‌ తరఫున గొప్పగా రాణించలేకపోతున్న కేఎల్ రాహుల్‌పై ఆసీస్‌తో మూడో టెస్టులో వేటు పడింది. అయితే, అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ కూడా గొప్పగా ఏమీ రాణించలేదు. దీంతో నాలుగో టెస్టులో రాహుల్‌కు చోటు కల్పించాలనే డిమాండ్లూ వస్తున్నాయి.

అయితే ఐపీఎల్‌-2022 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన లఖ్​నవూ జెయింట్స్​.. 14 మ్యాచ్‌లకు గానూ తొమ్మిది మ్యాచుల్లో గెలిచింది. ప్లే ఆఫ్​కు అర్హత సాధించినప్పటికీ టైటిల్‌ రేసులో మాత్రం వెనకబడింది. మరోవైపు లక్నో జెయింట్స్​తో పాటు ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌.. అరంగేట్ర సీజన్‌లోనే ట్రోఫీ సాధించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.