ETV Bharat / sports

ఆ మూడు కష్టాలను గట్టెక్కించిన సన్​రైజర్స్​.. ఇక 2023 ఎలా ఉండనుందో మరి ??

ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ప్లేయర్లను ఎంచుకునే విషయంలో ఆచీతూచీ వ్యవహరించింది. డిసెంబర్ 23న జరిగిన ఈవెంట్​లో నలుగురు ఓవర్‌సీస్ ఆటగాళ్లతో పాటు మొత్తం 13మందిని కొనుగోలు చేసింది. దీంతో ఈ వేలం ద్వారా సన్‌రైజర్స్ ఓ మూడు బలహీనతలను అధిగమించిందని చెప్పొచ్చు.

srh ipl 2023
srh ipl 2023
author img

By

Published : Jan 7, 2023, 11:33 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 2022లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కు కష్టకాలం ఎదురయినప్పటికీ ఉన్న నలుగురు పవర్​ఫుల్​ పేసర్లతోనే సీజన్​ను నెట్టుకొచ్చింది. పవర్​ ప్లేతో పాటు డెత్​ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్​, నటరాజన్​లు విజృంభించగా.. మిడిల్​ ఓవర్​లో ఉమ్రాన్​ మాలిక్​, కార్తీక్ త్యాగి, మార్కో జాన్సెన్, ఫజల్హాక్ ఫరూఖీలు చెలరేగిపోయారు. అయితే స్పిన్​ టీమ్​ మాత్రం ఎస్​ఆర్​హెచ్​కు ఏమాత్రం బలం చేకూర్చలేకపోయింది.

అప్పుడున్న వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్‌లతో స్పిన్‌ విభాగాన్ని ఓ మేర మేనేజ్​ చేయగలిగారు. దీంతో ఈ సారి వేలంలో ఆచితూచి అడుగులేస్తూ ఆరుగురు ప్లేయర్లను ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023లో ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, అకీల్ హోస్సెన్‌లను తీసుకొని ఆ బలహీనతకు చెక్ పెట్టింది. దేశవాళీలో రాణించిన వివ్రాంత్ శర్మను సన్‌రైజర్స్ కొనుగోలు చేయగా.. అతడు పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా జట్టుకు ఉపయోగపడనున్నాడు.

2022 సీజన్​లో ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠిలు సన్‌రైజర్స్ మిడిలార్డర్​లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. కానీ ఈ విషయంలో పూరన్ విఫలమ్వవడం వల్ల జట్టు గెలుపునకు ఆటంకంగా మారింది. దాని వల్ల అతడిపై వేటు వేసిన సన్‌రైజర్స్ ఆ లోటును హెన్రీచ్ క్లాసెన్‌తో పూర్తి చేసింది. మరోవైపు హరీ బ్రూక్‌ను టీమ్​లో జాయిన్​ చేసి బ్యాటింగ్‌కు మరింత బలం చేకూరేలా చేసింది. మయాంక్ అగర్వాల్ రాకతో టాప్​ ఆర్డర్​ కూడా మరింత పటిష్ఠంగా మారింది. బ్యాకప్​లో గ్లేన్ ఫిలిప్స్ ఉండటం జట్టుకు ఇంకాస్త ధైర్యం వచ్చింది.
అయితే గత సీజన్‌లో కేన్ విలియమ్సన్ జట్టును నడిపించినప్పటికీ.. ఎస్​ఆర్​హెచ్​ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అతడి స్థానంలో మరొకరిని తదుపరి కెప్టెన్‌గా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కొత్త జట్టుతో ఇక ఈ 2023.. సన్​రైజర్స్​కు ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్​ వెయిట్​ చేస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.