IPL 2021 retained players: వచ్చే ఐపీఎల్ సీజన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది(bcci ipl). అందులో భాగంగా రిటెన్షన్(ipl retention) ప్రక్రియ నవంబరు 30న జరిగింది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు నలుగురేసి ఆటగాళ్లను(ipl retention list) అట్టిపెట్టుకునే అవకాశం ఉండగా అన్నీ టీమ్స్ కలిపి 27మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నారు. ముంబయి, చెన్నై, దిల్లీ, కోల్‌కతా నలుగురేసి.. బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ ముగ్గురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్ చేసుకుంది. దీంతో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్, రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ప్లేయర్స్ మెగావేలంలో అందుబాటులో ఉండనున్నారు. ఇప్పుడు వారిని దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆటగాళ్ల ఐపీఎల్ స్టాట్స్ ఏంటి? ఎంత ధర పలికే అవకాశం ఉంది? ఏ జట్లు వారిని దక్కించుకుంటాయి? సహా పలు విషయాల సమాహారమే ఈ కథనం..
కేఎల్ రాహుల్..
punjab kings retained players: పంజాబ్ కింగ్స్.. మయాంక్ అగర్వాల్(రూ.12కోట్లు), అర్ష్‌దీప్ సింగ్‌ను(రూ.4కోట్లు) అట్టిపెట్టుకుంది. రాహుల్ రిటెయిన్ చేసుకోకపోవడానికి కారణాలు తెలియరాలేదు. రాహుల్ వ్యక్తిగతంగా రాణించినా.. జట్టును నడపడంలో విఫలమయ్యాడని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ(punjab kings xi team) భావించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూకు అతడు సారథ్యం వహించే అవకాశం ఉందని తెలిసింది. బీసీసీఐ నిబంధన ప్రకారం కొత్త ఫ్రాంచైజీలు.. తమ జట్లకు ఎంపికయ్యే కెప్టెన్లకు రూ.15కోట్లు మించి ఖర్చు చేయరాదు. కాబట్టి రాహుల్ కెప్టెన్‌గా ఎంపిక అయితే అతడి ధర రూ.15కోట్లు ఉంటుంది. ఈ మెగాలీగ్‌లో ఇప్పటివరకు అతడికి 94 మ్యాచ్‌లు(3,273 పరుగులు) ఆడిన అనుభవం ఉంది. అందులో రెండు సెంచరీలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి.
శిఖర్ ధావన్
shikhar dhawan ipl 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు(5,784) చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు శిఖర్ ధావన్. పంత్(రు.16 కోట్లు), అక్సర్ పటేల్(రూ.9కోట్లు), పృథ్వీ షా(రూ.7.50కోట్లు), నోర్జేను(రూ.6.50 కోట్లు) అట్టిపెట్టుకున్న దిల్లీ క్యాపిటల్స్ ధావన్‌ను రిలీజ్ చేసింది. ఇతడు ఇప్పటివరకు మెగాలీగ్‌లో 192 మ్యాచ్‌లు ఆడాడు. మరి ఇతడిని ఇదే జట్టు మెగావేలంలో కొనుగోలు చేస్తుందో లేదో చూడాలి.
శ్రేయస్ అయ్యర్
shreyas iyer retention: శ్రేయస్ అయ్యర్‌ను కూడా దిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేయలేదు. గతంలో ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు అయ్యర్. ఐపీఎల్లో 87 మ్యాచ్లుశ్(2,375) మ్యాచ్‌లు ఆడాడు. అందులో 16 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ సహా కొత్త జట్లకు కొత్త కెప్టెన్ల అవసరం ఉంది. కాబట్టి వీటిలో ఏదో ఓ జట్టుకు అతడు సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఇతడిని రూ.10 కోట్ల నుంచి రూ.15కోట్ల మధ్యలో తీసుకోవచ్చు.
రవిచంద్రన్ అశ్విన్
ravichandran ashwin ipl: సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా దిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసింది. గత సీజన్లో ఇతడు 13 మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. అయితే మెగావేలంలో మళ్లీ ఇతడిని రూ.కోటి లేదా రూ.2కోట్లకు దిల్లీనే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వార్నర్
david warner ipl 2021 team: గత సీజన్లో పేలవమైన ప్రదర్శనతో కెప్టెన్సీ సహా జట్టులో చోటు కోల్పోయాడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ప్లేయర్ వార్నర్. దీంతో సదరు ఫ్రాంచైజీ ఈ సారి రిటెయిన్ చేసుకోలేదు. ఇతడు రానున్న కొత్త జట్లలో ఒకదానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఇతడి ధర రూ.7కోట్ల నుంచి రూ.15కోట్లు పలకొచ్చు. ఇప్పటివరకు మెగాలీగ్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 5,449 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, 50 అర్ధ శతకాలు ఉన్నాయి.
రషీద్ ఖాన్
rashid khan ipl price 2021: అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను విడుదల చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పడతడు వేలంలోకి రానున్నాడు. కాగా, అతడు కూడా కొత్త జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడని తెలిసింది. రూ.5కోట్లు లేదా రూ.6కోట్లను ఇతడిని తీసుకోవచ్చు.
పాండ్య బ్రదర్స్
hardik pandya ipl 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఐదు సార్లు ట్రోఫి నెగ్గిన ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యను రిలీజ్ చేసింది. ఈ అన్నదమ్ములు గత కొద్ది కాలంగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నారు. ముంబయి.. మెగావేలంలోనూ వీరిని తీసుకునేది అనుమానమే. ఒకవేళ ముంబయి లేదా ఇతర జట్లు వీరిపై ఆసక్తి చూపితే రూ.2కోట్లు లేదా రూ.3కోట్లకు కొనుగోలు చేస్తాయి.
రూ.33కోట్లు మించరాదు
కాగా, కొత్త ఫ్రాంచైజీలకు రిటెన్షన్ పద్ధతి లేదు కనుక.. మెగావేలానికి ముందు తమ కొత్త ఆటగాళ్లను ఎంచుకుంటారు. ఈ టీమ్స్‌కు ముగ్గురు ప్లేయర్స్‌ను తీసుకనే అవకాశం ఉంది. వారిలో ఇద్దరు స్వదేశీ, ఒకరు విదేశీ ఆటగాడు ఉంటాడు. అయితే ఈ ఫ్రాంచైజీలకు ఉన్న రూ.90కోట్ల పర్సులో కేవలం రూ.33 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలని బీసీసీఐ నిబంధన విధించింది. ఈ నిబంధన ప్రకారం తొలి ప్రాధాన్య ఆటగాడికి రూ.15కోట్లు, రెండు, మూడు ప్లేయర్స్‌కు రూ.11కోట్లు, రూ.7కోట్లు వెచ్చించాలి. ఈ కొత్త జట్లకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన వారికి రూ.15కోట్లు కంటే ఎక్కువగా ఖర్చు చేయకూడదు. కాగా, కేఎల్ రాహుల్, వార్నర్, శ్రేయస్.. వీరిలో ఎవరైనా ఇద్దరు ఈ కొత్త టీమ్స్‌కు సారథులుగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి వీరికి రూ.15కోట్లు మించి రావు.
ఇదీ చూడండి: ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి జాబితా వచ్చేసింది.. ఎవరికి అత్యధిక ధరంటే?