Rohithsharam Warner player of the match record: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 92* పరుగులతో అజేయంగా నిలిచిన అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ మెగాలీగ్ చరిత్రలో అతడు 18వ సారి దీన్ని ముద్దాడాడు. దీంతో ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. హిట్‌మ్యాన్‌కు కూడా ఇప్పటివరకు 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వరించాయి. దీంతో ఈ పురస్కారాన్ని అత్యధిక సార్లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో వార్నర్ కూడా మూడో స్థానానికి చేరుకున్నాడు.
కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్(25) ఎక్కువ సార్లు ఈ అవార్డును అందుకున్న ప్లేయర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్(22), ధోనీ(17), కోహ్లీ(13) రెండు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ 186/8 పరుగులు చేసింది. పూరన్(62) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే అతడికి మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్‌రైజర్స్.. వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది.
ఇదీ చూడండి: SRH VS DC: ఆ జాబితాలో అగ్రస్థానంలోకి వార్నర్.. ఉమ్రాన్ @157