ETV Bharat / sports

మిడ్​ సీజన్​ బదిలీలకు చెన్నై జట్టు నో!

మిడ్​-సీజన్​ బదిలీ ప్రక్రియలో కొత్త ఆటగాళ్లను తీసుకోవడం లేదా తమ ఆటగాళ్లను బదిలీ చేసేది లేదని చెన్నై సూపర్​కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు.

csk
సీఎస్కే
author img

By

Published : Oct 14, 2020, 7:23 PM IST

ఈ ఐపీఎల్​ మిడ్​-సీజన్​ బదిలీ ప్రక్రియలో భాగంగా ఎలాంటి కొత్త ఒప్పందాలు చేసుకోమని చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. కొత్త ఆటగాళ్లని తీసుకోవడం లేదా తమ ఆటగాళ్లను వేరే ఫ్రాంచైజీకి బదిలీ చేసే ఉద్దేశం లేదని తెలిపారు​. కనీసం ఆ ఆలోచన కూడా రాలేదని వెల్లడించారు.

ఈ సీజన్​లో సురేశ్​ రైనా, హర్భజన్​ సింగ్​ తప్పుకున్న తర్వాత.. వారి స్థానాల్లో ఇతర ఆటగాళ్లను సీఎస్కే చేర్చుకోలేదు. మురళీ విజయ్​, కేదార్ జాదవ్​ లాంటి బ్యాట్స్​మెన్ విఫలమవ్వడం వల్ల మిడ్​-సీజన్​ బదిలీ ప్రక్రియ ద్వారా కొంతమంది భారత ఆటగాళ్లను తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విశ్వనాథన్​ స్పష్టతనిచ్చారు.

సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్​ తాహిర్​, త్వరలోనే ఈ సీజన్​లో తొలి​ మ్యాచ్​ ఆడతాడని కాశీ విశ్వనాథన్​ అన్నారు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో మూడింటిలో మాత్రమే గెలిచిన చెన్నై..మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి కోహ్లీ కిట్​ బ్యాగ్​లో ఏమేం ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.