బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి చెప్పడం వల్లే, ఆయన్ను విడిచిపెట్టి ఐపీఎల్లో పాల్గొనేందుకు వచ్చానని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు.
ఆగస్టులో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ సమయంలో స్టోక్స్.. తన తండ్రి దగ్గరకు న్యూజిలాండ్‌కు పయనమయ్యాడు. దాదాపు ఐదు వారాల పాటు అక్కడే ఉన్నాడు. ఐపీఎల్ కోసం ఈ మధ్యే యూఏఈ చేరుకున్నాడు.
"అమ్మ, నాన్నను విడిచిరావాలంటే చాలా కష్టంగా అనిపించింది. మా కుటుంబానికి ఇది క్లిష్ట సమయం. అయినా ఒకరికి ఒకరు అండగా నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నాం. నా బాధ్యతల గురించి నాకంటే నాన్నే ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. నేను నిర్వర్తించాల్సిన పనిచాలా ఉందని, దానిని పూర్తి చేయమని చెప్పారు" -స్టోక్స్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్
ప్రస్తుతం యూఏఈలోని క్వారంటైన్లో ఉన్న స్టోక్స్.. అక్టోబరు 10 నుంచి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ చెప్పాడు.