యూనివర్స్ బాస్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ బ్యాటింగ్‌పై దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అశ్విన్ హాస్యభరిత ట్వీట్ చేశాడు. దెయ్యంలాంటి అతడికి బౌలింగ్ చేయాలంటే ముందుగా అతడి రెండు కాళ్లు కట్టేయాలని సరదాగా అన్నాడు. మంగళవారం ఈ రెండుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గేల్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో విజృంభించాడు. ఈ నేపథ్యంలోనే అశ్విన్ వ్యాఖ్యలు చేశాడు.
-
The devil is always in the detail.😂😂😂 .. “Tie both his feet together, before bowling to him”.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) October 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Tough day for us @DelhiCapitals but, we will bounce back stronger. pic.twitter.com/4jO8JWyMCW
">The devil is always in the detail.😂😂😂 .. “Tie both his feet together, before bowling to him”.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) October 21, 2020
Tough day for us @DelhiCapitals but, we will bounce back stronger. pic.twitter.com/4jO8JWyMCWThe devil is always in the detail.😂😂😂 .. “Tie both his feet together, before bowling to him”.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) October 21, 2020
Tough day for us @DelhiCapitals but, we will bounce back stronger. pic.twitter.com/4jO8JWyMCW
ఈ మ్యాచ్‌లో గేల్ షూస్ లేస్ కట్టాడు అశ్విన్. దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశాడు. "దెయ్యం ఎప్పడూ విధ్వంసమే సృష్టిస్తుంది. అందుకే అతడి రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్ చేయాలి. దిల్లీ జట్టుకు కఠినమైన రోజు. వెంటనే పుంజుకుని మరింత బలంగా తయారవుతాం" అని అశ్విన్ రాసుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో గేల్‌ను అశ్విన్ ఔట్ చేయడం విశేషం. ఇప్పటివరకు వీరిద్దరూ 11 సార్లు తలపడగా, అశ్విన్ చేతిలో గేల్ ఐదు సార్లు ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది. విజయంలో గేల్‌తో పాటు నికోలస్ పూరన్(53), మ్యాక్స్‌వెల్(32) రాణించారు.
ఇదీ చూడండి సూపర్ ఓవర్ సుందరి.. ఇంతకీ ఆమె ఎవరు?