ఆస్ట్రేలియా పర్యటనకు ఓపెనర్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని టీమ్ఇండియా ఫిజియో నితిన్ పటేల్ సెలెక్టర్లకు చెప్పాడు. ఇందువల్లే అతడిని ఎంపిక చేయనట్లు తెలుస్తోంది. ఇటీవలే జట్టును ప్రకటించిన బీసీసీఐ.. గాయాలపాలైన రోహిత్, ఇషాంత్.. వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది.
జట్టును ప్రకటించిన కొన్ని గంటలకే నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్న రోహిత్ ఫొటోలను ముంబయి ఇండియన్స్ ట్వీట్ చేసింది. దీంతో బీసీసీఐతో పాటు సెలెక్టర్లు ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఆసీస్ టూర్లో అవకాశం కోసం కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు హిట్‌మ్యాన్ దూరం కావాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫిజియో నితిన్ పటేల్ బీసీసీఐకి ఇచ్చిన నివేదిక ప్రకారం రోహిత్ శర్మకు మరో మూడువారాల విశ్రాంతి అవసరమని సూచించాడు. ఆ వివరాలను సునీల్ జోషి నేతృత్వంలోని సెలెక్షన్ ప్యానెల్‌కు సమర్పించాడు. అందుకు అనుగుణంగానే ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేయలేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
-
4️⃣5️⃣ seconds of RO 4️⃣5️⃣ in full flow!🔥#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @ImRo45 pic.twitter.com/65ajVQcEKc
— Mumbai Indians (@mipaltan) October 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">4️⃣5️⃣ seconds of RO 4️⃣5️⃣ in full flow!🔥#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @ImRo45 pic.twitter.com/65ajVQcEKc
— Mumbai Indians (@mipaltan) October 26, 20204️⃣5️⃣ seconds of RO 4️⃣5️⃣ in full flow!🔥#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @ImRo45 pic.twitter.com/65ajVQcEKc
— Mumbai Indians (@mipaltan) October 26, 2020
"ప్రతి ఆటగాడి ఫిట్నెస్ నివేదికను నితిన్ పటేల్, మాకు సమర్పించాడు. ఎంపిక ప్రక్రియలో అది భాగమే. జట్టుకు ఏ ఆటగాడు సరిపోతాడనే విషయాన్ని అతడు తెలియజేస్తాడు. గాయం కారణంగా రోహిత్ అందుబాటులో ఉండడని సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. జట్టుకు చెందిన ఇద్దరు వైద్యులు, రోహిత్‌కు రెండు నుంచి మూడు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు"
-బీసీసీఐ అధికారి
రోహిత్‌శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారడం వల్ల బీసీసీఐపై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్‌కు ఎలాంటి గాయమైందో బహిరంగ చర్చ అవరసరమని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్నాడు. హిట్‌మ్యాన్ బ్యాటింగ్ చేస్తున్నట్లు తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ అభిప్రాయపడింది. గాయం నుంచి రోహిత్ కోలుకుంటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశముందని తెలిపింది.