ETV Bharat / sports

గాయం తగ్గింది.. బాగానే ఉన్నాను: రోహిత్​ శర్మ - mumbai league match

గాయం నుంచి కోలుకున్నానని చెప్పిన ప్రముఖ బ్యాట్స్​మెన్ రోహిత్ శర్మ.. హైదరాబాద్​పై ఓడిపోవడం నిరాశ కలిగించిందని అన్నాడు.

Hamstring is absolutely fine said mumbai captain rohith sharma  after lossing the match against delhi
నా తొడ కండరం బాగానే ఉంది:రోహిత్​ శర్మ
author img

By

Published : Nov 4, 2020, 1:14 PM IST

రెండు వారాల విరామం తర్వాత తిరిగి ఐపీఎల్ మ్యాచ్​ ఆడటం సంతోషంగా ఉందని చెప్పాడు స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ. తొడ కండర గాయం నుంచి కోలుకున్నానని వెల్లడించాడు. అయితే హైదరాబాద్​ చేతిలో ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్​లో ఇదే అసమర్థ ప్రదర్శన అని తెలిపాడు. దీనిని మర్చిపోయి ముందుకు సాగుతామని అన్నాడు.

"జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. మరిన్ని మ్యాచ్​లు ఆడాలనుకుంటున్నాను. చూద్దాం, ఏం జరుగుతుందో. నా తొడ కండరం ప్రస్తుతం బాగుంది. మాకు ఇది గుర్తు పెట్టుకునే రోజు కాదు. ఈ సీజన్​లో ఇదే మా అసమర్థ ప్రదర్శన. మేము కొన్ని పద్ధతుల్లో ఆడాలనుకున్నాం. కానీ, అది సరిగా జరగలేదు. బౌలింగ్​ చేస్తుంటే మంచు ఇబ్బంది పెట్టింది. ఇదో సరదా ఫార్మాట్​. ఏం జరిగిందో మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టడం అవసరం. దిల్లీ తరఫున చక్కని ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లతో ఆడటం చాలా ఛాలెంజింగ్​గా ఉంటుంది"

--రోహిత్​ శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్

అక్టోబర్​ 18న పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రోహిత్ తొడ కండరాలు పట్టేశాయి. ఈ గాయం కారణంగానే ఆ తర్వాత ముంబయి ఆడిన నాలుగు మ్యాచ్​లకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా సిరీస్‌ సమయానికి ఫిట్‌నెస్‌ సాధించడేమో అన్న అనుమానంతో ఇతడిని భారత సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడి అభిమానులు నిరాశకు గురయ్యారు.

నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది టీమ్​ఇండియా. ఇందులో భాగంగా తలో మూడు వన్డేలు, టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.

ఇదీ చూడండి:'ఒక్క సిరీస్​కు రోహిత్ దూరమైతే ఏమవుతుంది?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.