రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెట్ సెషన్లో హెలికాప్టర్ షాట్‌ను ప్రాక్టీసు చేస్తున్నాడు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన రాయల్స్ యాజమాన్యం.."హెలికాప్టర్ షాట్ ఆడే కెప్టెన్‌ను ప్రేమించాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
-
Gotta love a captain who plays the helicopter shot! 😉#HallaBol | #RoyalsFamily | @stevesmith49 pic.twitter.com/tPKYZuR745
— Rajasthan Royals (@rajasthanroyals) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gotta love a captain who plays the helicopter shot! 😉#HallaBol | #RoyalsFamily | @stevesmith49 pic.twitter.com/tPKYZuR745
— Rajasthan Royals (@rajasthanroyals) September 24, 2020Gotta love a captain who plays the helicopter shot! 😉#HallaBol | #RoyalsFamily | @stevesmith49 pic.twitter.com/tPKYZuR745
— Rajasthan Royals (@rajasthanroyals) September 24, 2020
చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఇటీవలే జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. స్టీవ్ స్మిత్ 47 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది.
ఆ తర్వాత ఛేదనలో దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో 16 పరుగులతో వెనుకబడి రాజస్థాన్‌పై పరాజయాన్ని చవిచూసింది. డుప్లెసిస్ 37 బంతుల్లో 72 రన్స్ చేసి సీఎస్కేలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఐపీఎల్‌లోని తర్వాతి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది.