ETV Bharat / sports

'ముంబయికి ఓపెనర్​గా ఆడాలనేది నా కోరిక' - ముంబయి వర్సెస్​ కోల్​కతా

ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​గా ముంబయి ఇండియన్స్​ జట్టులో ఆడాలనే కోరికను వెల్లడించాడు ఆ టీమ్ బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​. ఓపెనర్​గా ఆడటానికి యాజమాన్యం అనుమతిస్తే చాలా సంతోషిస్తానని తెలిపాడు.

IPL 2020: Suryakumar Yadav wants to open batting for MI
'బ్యాటింగ్​లో ఓపెనర్​గా​ ఆడాలనేది నా కోరిక'
author img

By

Published : Sep 24, 2020, 9:55 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ముంబయి ఇండియన్స్​ జట్టు ఓపెనర్​​గా ఆడాలనేది తన కోరిక అని అన్నాడు ఆ జట్టు బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​. యాజమాన్యం అవకాశమిస్తే తొలిస్థానంలో బ్యాటింగ్​ చేస్తానని తెలిపాడు. కోల్​కతాతో మ్యాచ్​ అనంతరం జరిగిన వర్చువల్​ ఇంటర్వ్యూలో ఏ స్థానంలో బ్యాటింగ్​ చేయడానికి ఇష్టపడతారని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చాడు.

"ఇది యాజమాన్యం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. గతంలో ఆడిన విధంగానే ముంబయి ఇండియన్స్​ ఓపెనర్​గా బ్యాటింగ్​ చేయాలనుకుంటున్నా. ఒకవేళ నాకు ఆ అవకాశం వస్తే చాలా సంతోషిస్తా."

- సూర్యకూమార్​ యాదవ్​, ముంబయి ఇండియన్స్​ బ్యాట్స్​మన్​

కోల్​కతా నైట్​రైడర్స్​, ముంబయి ఇండియన్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్​లో కెప్టెన్​ రోహిత్​ శర్మతో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్​. మూడోస్థానంలో బ్యాటింగ్​కు దిగి 28 బంతుల్లో 47 (6 ఫోర్లు, ఒక సిక్సర్​) రన్స్​ చేశాడు.

ముంబయి ఇండియన్స్ కెప్టెన్​ రోహిత్​ శర్మ బ్యాటింగ్​ను సూర్యకుమార్​ యాదవ్​ ప్రశంసించాడు. "రోహిత్​ శర్మ ప్రపంచస్థాయి బ్యాట్స్​మన్​. వాంఖడే స్టేడియంలో ఎలా బ్యాటింగ్​ చేస్తాడో.. అబుదాబిలోనూ అలాంటి ప్రదర్శనే చేశాడు. ఇక్కడ బౌండరీలు పెద్దవైనా.. అతడి బ్యాటింగ్​లో ఎలాంటి మార్పు రాలేదు. రోహిత్​ శర్మ చాలా సహజంగా ఆడతాడు. ఆ ఆటతీరును మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు" అని తెలిపాడు.

ముంబయి ఇండియన్స్​.. ఐపీఎల్​లోని తమ తర్వాతి మ్యాచ్​ను సెప్టెంబరు 28న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో ఆడనుంది.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.