ETV Bharat / sports

ఐపీఎల్ మజా షురూ.. తొలి మ్యాచ్​లో ముంబయి-చెన్నై - ముంబయి ఇండియన్స్

క్రికెట్ ప్రేమికులకు మజా అందించేందుకు ఐపీఎల్ వచ్చేసింది. ఈరోజు తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్​తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ రసవత్తర పోరుకు అంతా సిద్ధమైపోయింది. కరోనా కారణంగా ఈసారి లీగ్​ యూఏఈలో జరగబోతుంది. బయోబబుల్​ లాంటి సురక్షిత వాతావరణంలో ఈలీగ్ ఎంతమేర విజయవంతమవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

IPL 2020
ఐపీఎల్ 2020
author img

By

Published : Sep 19, 2020, 7:18 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

వేసవి ఎప్పట్లాగే ఈసారీ వచ్చింది. వెళ్లిపోయింది! కానీ ఎప్పట్లా సిక్సర్లూ, సెంచరీలూ లేవు.. వికెట్లూ, సూపర్‌ ఓవర్లూ లేవు! ఈ రోజు రాత్రికి గెలిచేదెవరిని చర్చ లేదు. నిన్నటి మ్యాచ్‌ గురించి విశ్లేషణ లేదు! పాయింట్ల పట్టిక ఊసు లేదు.. ప్లేఆఫ్‌ బెర్తుల గురించి ఉత్కంఠ లేదు! ఇటు టీవీలు మూగబోయాయి.. అటు మైదానాలు బోసిపోయాయి! ఆటగాళ్లు, అభిమానులు, వ్యాఖ్యాతలు.. ఇలా అందరూ ఇళ్లకే పరిమితం! పుష్కర కాలంగా అలవాటు పడ్డ వినోదం లేక అందరిలోనూ నిస్తేజం! కానీ ఈసారికి ఇంతే అని నిట్టూర్చిన వేళ.. ఆలస్యంగా అయినా సరే, ఐపీఎల్‌ ఉందన్న కబురుతో ఎక్కడ లేని ఉత్సాహం! అయితే ఈసారి ఐపీఎల్‌ జరిగేది మన వేదికల్లో కాదు.. స్టాండ్స్‌లో వీక్షకులూ కనిపించరు.. అభిమానులందరూ టీవీల ముందే.. వ్యాఖ్యాతలు ఎక్కడెక్కడో.. కరోనా వేళ.. ఎన్నో భయాలు, షరతుల మధ్య జరగబోతోంది ఆట! ఈ ప్రతికూలతలు ఎన్నుంటే ఏం.. ఎలాగోలా ఐపీఎల్‌ అయితే జరగబోతోంది. ఫేవరెట్‌ క్రికెట్‌ స్టార్లందరినీ మళ్లీ చూడబోతున్నాం. ఏ అడ్డంకీ లేకుండా ఆట సాగిపోతే అదే చాలన్నది అందరి ఆకాంక్ష! విరామం తర్వాత వినోదానికి సిద్ధమా మరి!

కరోనా మహమ్మారి ధాటికి అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడ్డ ఐపీఎల్‌ 13వ సీజన్‌.. ఎట్టకేలకు నేడు ఆరంభం కాబోతోంది. దేశంలో వైరస్‌ విజృంభణ తగ్గకపోవడం వల్ల యూఏఈకి తరలిన లీగ్‌.. అక్కడి మూడు వేదికల్లో (దుబాయ్‌, అబుదాబి, షార్జా) 50 రోజుల పాటు సందడి చేయబోతోంది. కరోనా నేపథ్యంలో గత రెండు నెలల్లో జరిగిన అంతర్జాతీయ సిరీస్‌ల తరహాలోనే బయో బబుల్‌ సెక్యూర్‌ విధానంలో అనేక షరతుల మధ్య, ఖాళీ మైదానాల్లో అభిమానులు లేకుండా లీగ్‌ను నిర్వహించనున్నారు.

IPL 2020
ఐపీఎల్ 2020

నాలుగు వారాల కిందటే యూఏఈకి చేరుకుని, క్వారంటైన్‌ పూర్తి చేసుకుని.. రెండు వారాల పాటు ప్రాక్టీస్‌ చేసిన ఎనిమిది జట్లు ఇక అసలు ఆటకు సిద్ధమయ్యాయి. శనివారం రాత్రి 7.30కు ఆరంభమయ్యే తొలి పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయిని రన్నరప్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఢీకొంటోంది. లీగ్‌ చరిత్రలో అత్యుత్తమ జట్ల మధ్య పోరుతో ఐపీఎల్‌కు రసవత్తర ఆరంభం లభిస్తుందన్నది అందరి ఆకాంక్ష.

జట్లన్నీ యూఏఈకి చేరుకున్న కొన్ని రోజులకే చెన్నై శిబిరంలోకి ప్రవేశించి అందరినీ ఆందోళనకు గురి చేసిన కరోనా.. టోర్నీ మధ్యలో అతిథిగా రావొద్దన్నది అందరి కోరిక. ఈ మహమ్మారికి ఎదురు నిలిచి, పోటాపోటీ ఆటతో అభిమానుల అంచనాలకు తగ్గని విధంగా లీగ్‌ను జరిపించగలిగితే క్రికెట్‌ ప్రపంచానికి అది గొప్ప ఊరట అవుతుందనడంలో సందేహం లేదు.

వేడి బాబోయ్‌..

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ లాంటి దేశాల నుంచి ఐపీఎల్‌ కోసం భారత్‌కు వచ్చే ఆటగాళ్లు.. మన వాతావరణానికే అల్లాడిపోతుంటారు. మరి ఇప్పుడు ఐపీఎల్‌ జరగబోయేది యూఏఈలో. అక్కడ రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు 35-40 డిగ్రీల మధ్య ఉంటాయి. రాత్రి పది గంటలకు కూడా వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నుట్లు దక్షిణాఫ్రికా స్టార్‌ డివిలియర్స్‌ తాజాగా వాపోయాడు. మధ్యాహ్నం మ్యాచ్‌లు తక్కువే అయినా.. అవి సవాలు విసురుతాయి. రాత్రి మ్యాచ్‌ల్లోనూ ఉక్కపోతతో ఆటగాళ్లు ఇబ్బంది పడటం, విపరీతంగా చెమటలు కారి అలసిపోవడం ఖాయం. ఇది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందే.

IPL 2020
బుమ్రా, మార్ష్

అరగంట ముందే..

ఐపీఎల్‌లో సాయంత్రం మ్యాచ్‌లు 4 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 8 గంటలకు మొదలవడం ఆనవాయితీ. అయితే యూఏఈ ఆతిథ్యమివ్వనున్న ఈ సీజన్లో మ్యాచ్‌ల వేళలు మారాయి. సాయంత్రం మ్యాచ్‌లు 3.30కే ఆరంభం కానుండగా.. జరిగే రాత్రి మ్యాచ్‌లు 7.30కి మొదలవుతాయి. అయితే మొత్తం 60 మ్యాచ్‌ల్లో 3.30కి మొదలయ్యే మ్యాచ్‌లు పది మాత్రమే. ఐపీఎల్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది.

అతడి గ్లోవ్స్‌ ఎవరివి?

పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ వారసుడెవరు అనే ప్రశ్నకు టీమ్‌ఇండియా ఇంకా సమాధానం కనుక్కోలేదు. ధోనీ ఉండగానే, కొన్నేళ్ల ముందు నుంచే ఈ దిశగా ప్రయత్నాలు మొదలైనా ఫలితం లేకపోయింది. ఇప్పుడు మహీ నిష్క్రమించాడు. ఇక ఆ స్థానాన్ని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాల్సిందే. ఆరంభంలో ఆశలు రేపి, ఆ తర్వాత అవకాశాల్ని వృథా చేసిన రిషబ్‌ పంత్‌.. దక్కిన కొన్ని అవకాశాల్ని ఉపయోగించుకోని సంజూ శాంసన్‌.. తాత్కాలిక పరిష్కారంలా కనిపిస్తున్న కేఎల్‌ రాహుల్‌.. ఈ ముగ్గురూ టీమ్‌ఇండియాలో ధోనీ గ్లోవ్స్‌ను తొడుక్కోవడానికి పోటీ పడుతున్నారు. ఈ ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా ఆ గ్లోవ్స్‌ ఎవరివన్నది తేలుతుంది.

IPL 2020
ధోనీ

అందరిచూపు మహీపైనే

2019 జులై 10.. చివరగా మహేంద్రసింగ్‌ ధోనీని మైదానంలో చూసిన రోజు. 2020 సెప్టెంబరు 19.. మళ్లీ అతణ్ని మైదానంలో చూడబోతున్న రోజు. దీంతో అభిమానులు అమితాసక్తితో ఉన్నారు. మామూలుగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైపోయిన ఆటగాళ్లపై ఐపీఎల్‌లో ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ ధోనీ పరిస్థితి భిన్నం. ముందుకన్నా అతడి ఆటపై ఎక్కువ ఆసక్తి కనిపిస్తోందిప్పుడు. ఇక ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తాడనే ఆలోచన కోట్లాదిమంది అతడి అభిమానుల్ని లీగ్‌కు అతుక్కుపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.

అయితే చివరగా ఆడినపుడు మహీ ఏమంత గొప్ప ఫామ్‌లో లేడు. ఇప్పుడతడి వయసు 39 ఏళ్లు దాటింది. ఫిట్‌నెస్‌పై సందేహాలున్నాయి. ఏడాదికి పైగా విరామం తర్వాత మ్యాచ్‌లు ఆడబోతున్నాడు. ఈ స్థితిలో ధోనీ బ్యాటింగ్‌లో, వికెట్‌ కీపింగ్‌లో ఏమాత్రం చురుకుదనం చూపిస్తాడో.. ఎన్ని మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడతాడో చూడాలి. ఇంతకుముందులా ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో విధ్వంసకంగా ఆడి మ్యాచ్‌లను ముగించగలడా అన్నది అతి పెద్ద ప్రశ్న. ఇక చెన్నై జట్టులో మహీ కుడిభుజం అనదగ్గ రైనా లేడు. అతడి స్థానాన్ని ధోనీ ఎలా, ఎవరితో భర్తీ చేస్తాడన్నది ఆసక్తికరం. కరోనా దెబ్బతో చెన్నై జట్టుకు ప్రాక్టీస్‌ కూడా తక్కువైంది. ఎప్పట్లాగే చెన్నై జట్టు వయసు పైబడ్డ ఆటగాళ్లతో నిండిపోయింది. ఈ ప్రతికూలతల్ని అధిగమించి వ్యక్తిగతంగా సత్తా చాటడం, జట్టును విజయవంతంగా నడిపించడం తేలిక కాదు. మరి తన ఐపీఎల్‌ భవితవ్యాన్ని కూడా నిర్దేశించే ఈ సీజన్లో మహీ ఏం చేస్తాడో మరి?

IPL 2020
చెన్నై సూపర్ కింగ్స్

బ్యాటాటలో బంతి జోరు?

టీ20లంటేనే బ్యాట్స్‌మెన్‌ జోరు సాగే ఫార్మాట్‌. ఐపీఎల్‌లో ఆ జోరు మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ టీ20 క్రికెట్లో బ్యాటింగ్‌ రికార్డుల్లో చాలా వరకు ఈ లీగ్‌ పేరిటే ఉంటాయి. ఇక్కడ ఎన్ని పరుగులు చేసినా సంతృప్తి ఉండదు. ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదు. అయితే ఈసారి లీగ్‌లో మాత్రం భిన్నమైన దృశ్యాలు కనిపించొచ్చన్నది విశ్లేషకుల అంచనా. యూఏఈ పిచ్‌ల్లో అంత వేగం ఉండదు. ముఖ్యంగా టోర్నీ ద్వితీయార్ధంలో అవి బాగా నెమ్మదిస్తాయంటున్నారు. 140-150 లక్ష్యాల ఛేదన కూడా కష్టమవుతుందని.. స్పిన్నర్ల ఆధిపత్యం సాగడం ఖాయమని భావిస్తున్నారు.

ముంబయి-చెన్నై పోరు

లేక లేక ఐపీఎల్‌.. అందులోనూ లీగ్‌ చరిత్రలో టాప్‌-2 జట్ల మధ్య తొలి పోరు.. ఇక మజాకు కొదవేముంది? శనివారం నాటి ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. నైపుణ్యాల్లో ఈ రెండు జట్లూ వేటికవే సాటి. కెప్టెన్లుగా ఓవైపు ధోనీ, మరోవైపు రోహిత్‌.. ఒక జట్టులో బ్రావో, వాట్సన్‌, జడేజా.. మరో జట్టులో పొలార్డ్‌, బుమ్రా, పాండ్య.. ఆసక్తి రేకెత్తించే ఆటగాళ్లకు కొదవ లేదు. ఐపీఎల్‌ ఆరంభానికి ఇంతకంటే మంచి మ్యాచ్‌ మరేదుంటుంది? మరి ఈ మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్లే హోరాహోరీగా సాగుతుందా?

IPL 2020
రోహిత్, డికాక్

28 ఐపీఎల్‌లో ఇప్పటివరకూ చెన్నై, ముంబయి జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిలో ముంబయి 17, చెన్నై 11 విజయాలు సాధించాయి. చివరగా గత సీజన్‌ ఫైనల్లో చెన్నైపై ముంబయి నెగ్గింది.

4 ఐపీఎల్‌లో నాలుగు సీజన్‌లలో ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీపడితే ముంబయి మూడు సార్లు గెలవగా.. చెన్నై ఓ సారి నెగ్గింది.

కొట్టినోళ్లకా.. కొత్త వాళ్లకా?

ఐపీఎల్‌లో కొత్త విజేతను చూసి నాలుగేళ్లు అయిపోయింది. చివరగా 2016లో సన్‌రైజర్స్‌ విజేతగా నిలిచింది. లీగ్‌లో టైటిల్‌ దక్కని జట్లు.. బెంగళూరు, దిల్లీ, పంజాబ్‌. వీటిలో దిల్లీ ఒక్కసారి కూడా ఫైనల్‌కు రాలేదు. బెంగళూరు మూడుసార్లు, పంజాబ్‌ ఒకసారి ఫైనల్స్‌ ఆడినా నిరాశ తప్పలేదు. ఈసారైనా కప్పు గెలవాలని ఈ మూడు జట్లూ ఎంతో ఆశతో ఉన్నాయి. మరోవైపు అత్యధికంగా నాలుగు కప్పులు గెలిచిన ముంబయి, మూడుసార్లు విజేతగా నిలిచిన చెన్నై, రెండు టైటిళ్ల కోల్‌కతా.. ఒక్కోసారి విజేతగా నిలిచిన సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ కూడా ఐపీఎల్‌ ట్రోఫీపై కన్నేశాయి. మరి ఈసారి కప్పు మాజీ విజేతలకే దక్కుతుందా.. కొత్త వాళ్లను వరిస్తుందా అన్నది చూడాలి.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.