ETV Bharat / sports

ఐసీసీ నిద్రపోతుందా?.. ఇంజమామ్​ ఆగ్రహం! - ఐపీఎల్​ 2021

పాకిస్థాన్​ పర్యటనకు న్యూజిలాండ్​ స్టార్​ ఆటగాళ్లు దూరంగా ఉండడంపై పాక్​ మాజీ కెప్టెన్​ ఇంజమామ్​ ఉల్​ హక్​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్​ కోసం ఆటగాళ్లు అంతర్జాతీయ సిరీస్​ నుంచి ఎలా తప్పుకొంటారని ప్రశ్నించాడు. ఐసీసీ తీరు ఆశ్చర్యంగా ఉందని అన్నాడు.

Inzamam-ul-Haq irked with NZ players pulling out of Pakistan series for IPL 2021
ఐసీసీ నిద్రపోతుందా?- ఇంజమామ్​ ఆగ్రహం!
author img

By

Published : Aug 11, 2021, 12:20 PM IST

వచ్చే నెలలో పాకిస్థాన్​తో జరగనున్న సిరీస్​కు న్యూజిలాండ్​ స్టార్​ క్రికెటర్లు దూరంగా ఉండడంపై పాక్​ మాజీ కెప్టెన్​ ఇంజమామ్​ ఉల్​ హక్​ స్పందించాడు. ఐపీఎల్ లాంటి ప్రైవేట్​ లీగ్​ కోసం అంతర్జాతీయ క్రికెట్​ను విస్మరించడం తగదని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఐసీసీ పాత్రపై ఇంజమామ్​ విచారం వ్యక్తం చేశాడు.

"పాకిస్థాన్​ జట్టు ఏ దేశంతో మ్యాచ్​లు ఆడేందుకు వెళ్లినా.. ప్రత్యర్థి జట్టులో ప్రధాన ప్లేయర్లు ఉండడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్​లో దక్షిణాఫ్రికా వెళ్లగా.. వారి జట్టులోని కీలక ఆటగాళ్లను ఐపీఎల్​ ఆడేందుకు పంపారు. ఆ తర్వాత ఇంగ్లాండ్​ టూర్​కు వెళ్లినా.. కరోనా పేరుతో మెయిన్​ ప్లేయర్లను పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్​తో జరగనున్న సిరీస్​లోనూ అదే జరగబోతోంది. ఇలా అయితే పాకిస్థాన్​ జట్టుకు ప్రాక్టీస్​ ఎలా లభిస్తుంది? అయినా అంతర్జాతీయ సిరీస్​లను కాదని.. ప్రైవేట్​ లీగ్స్​ ఆడేందుకు ఆటగాళ్లకు అనుమతినిస్తుంటే ఐసీసీ ఏం చేస్తుంది? అదేంటో పాకిస్థాన్​తో సిరీస్​లు ఆడే ముందే ఇలాంటివి సంభవించడం ఆశ్చర్యం కలిగిస్తోంది."

- ఇంజమామ్​, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​

సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు ఐపీఎల్​ 2021 రెండో దశ​ జరగనుంది. ఈ లీగ్​లో పాల్గొనేందుకు న్యూజిలాండ్​కు చెందిన కేన్ విలియమ్సన్, ట్రెంట్​ బౌల్ట్​, కైలీ జెమిసన్​, లూకీ ఫెర్గూసన్​, జిమ్మి నీషమ్​, మిచెల్​ శాంటర్న్​, టిమ్​ సీఫర్ట్​ తదితరులు పాకిస్థాన్​ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. దీంతో పాక్​ పర్యటన కోసం టామ్​ లాథమ్​ను కెప్టెన్​గా నియమించింది కివీస్​ జట్టు యాజమాన్యం. అయితే ఇటీవలే ప్రకటించిన కివీస్​ టీ20 ప్రపంచకప్​ జట్టులో టామ్​ లాథమ్​కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి.. లార్డ్స్​ టెస్టుకు శార్దూల్​ దూరం.. అశ్విన్​కు చోటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.