క్రికెట్లో కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అభిమానుల మనసుల్లో చెరిగిపోని రికార్డులుగా మిగిలిపోతాయి. అవి గుర్తొస్తే అలాంటివి మరోసారి జరిగితే బాగుండని అనిపిస్తుంటుంది. ఇలాంటి అరుదైన ఘనతల్లో యువరాజ్ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సర్లు(Yuvraj Singh 6 Sixes) ఘనత ఒకటి. ఈ క్రికెటర్ గుర్తొస్తే మనకు ముందుగా కళ్లముందు మెదిలేది ఆరు సిక్సర్లే. అందుకే యువీని సిక్సర్ల కింగ్ అని ముద్దుగా పిలుస్తుంటారు!
సరిగ్గా 14 ఏళ్ల క్రితం (సెప్టెంబర్ 19) టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(Yuvraj Singh T20 World Cup 2007) ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది ప్రత్యర్థికి పీడకల మిగిల్చాడు.
ఈ మ్యాచ్‌లో యువీ సంచలన ఇన్నింగ్స్‌తో క్రికెట్ అభిమానులను అలరించాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకముందు గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (ఇండియా), గిబ్స్ (దక్షిణాఫ్రికా)లు మాత్రమే ఈ మార్క్‌ను అందుకున్నారు.
-
#OnThisDay in 2007, @YUVSTRONG12 went berserk and hammered 6⃣ sixes in an over to score the fastest ever T20I fifty. 🔥 👏#TeamIndia pic.twitter.com/vt9Lzj1ELv
— BCCI (@BCCI) September 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#OnThisDay in 2007, @YUVSTRONG12 went berserk and hammered 6⃣ sixes in an over to score the fastest ever T20I fifty. 🔥 👏#TeamIndia pic.twitter.com/vt9Lzj1ELv
— BCCI (@BCCI) September 19, 2021#OnThisDay in 2007, @YUVSTRONG12 went berserk and hammered 6⃣ sixes in an over to score the fastest ever T20I fifty. 🔥 👏#TeamIndia pic.twitter.com/vt9Lzj1ELv
— BCCI (@BCCI) September 19, 2021
ఆ గొడవే కారణం
యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు ఫ్లింటాఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య మాటామాటా(Yuvraj Vs Flintoff) పెరిగింది. అంతే ప్రత్యర్థికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని ఫిక్స్ అయిపోయాడు యువీ. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు(Stuart Broad 6 Sixes) బాదేశాడు. బంతి వేయడమే ఆలస్యం అన్నట్లుగా వచ్చిన బంతిని వచ్చినట్లుగానే బౌండరీ లైన్ దాటించేశాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌కైనా ఇదే వేగవంతమైన అర్ధశతకం(Fastest Half Century in T20 WC) కావడం మరో రికార్డు.
యువీ 16 బంతుల్లో 58 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (68), గౌతం గంభీర్ (58) మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. ధోనీ నేతృత్వంలోని టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను(IND Vs ENG T20 WC 2007) ధోనీసేన 200 పరుగులకే కట్టడి చేసింది. ఫలితంగా ఇంగ్లీష్ జట్టుపై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇదీ చూడండి.. CSKvsMI: ఆధిపత్య పోరులో విజయం ఎవరిదో!