ETV Bharat / sports

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగమైన యూనిసెఫ్‌ - UNICEF

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి(యూనిసెఫ్​) భాగమైంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, కౌమార దశలోని వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC News)తో యూనిసెఫ్​ ఒప్పందం కుదుర్చుకుంది.

ICC and UNICEF partner to help break stigma around mental health
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగమైన యూనిసెఫ్‌
author img

By

Published : Oct 15, 2021, 3:24 PM IST

ఆదివారం నుంచి ప్రారంభమ‌య్యే ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి(యూనిసెఫ్‌) భాగమైంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, కౌమర దశలోని వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్‌.. ఐసీసీతో ఒప్పందం చేసుకుంది.

యావత్‌ ప్రపంచం టీ-20 వరల్డ్‌కప్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. చిన్నారుల ఆరోగ్యం కోసం యూనిసెఫ్‌(UNICEF News) చేస్తున్న ఈ ప్రచారం ప్రపంచం నలుమూలలకు విస్తరించనుంది. 'ఆన్‌యువర్‌మైండ్‌' హ్యాష్‌ట్యాగ్‌తో జరిగే ఈ ప్రచారం.. వ్యక్తుల మానసిక ఆరోగ్యం కోసం తాము ఏమేర నిబద్ధతను కలిగి ఉన్నామో తెలియజేస్తుందని ఐసీసీ ప్రకటించింది. యూఏఈ, ఒమన్‌ వేదికగా టీ-20 ప్రపంచకప్‌ జరగనుండగా మెుత్తం 45 మ్యాచులను ఐసీసీ నిర్వహించనుంది.

ఇదీ చూడండి.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. ఆ సూపర్​ యాడ్​ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.