ETV Bharat / sports

INDw vs AUSw : మ్యాచ్​ను మలుపు తిప్పిన రనౌట్​.. 'అంత కన్నా దురదృష్టం లేదు' - మహిళల టీ20 వరల్డ్​ కప్ హర్మన్​ ప్రీత్​ కౌర్

INDw vs AUSw : మహిళల టీ20 వరల్డ్​ కప్​ సెమీ ఫైనల్​లో టీమ్ఇండియా పోరాడి ఓడిపోయింది. 5 పరుగులు తేడాతో ఆసీస్​ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​ను మలుపు తిప్పింది మాత్రం హర్మన్​ ప్రీత్​ కౌర్​ రనౌట్​. ఈ మేరకు హర్మన్​ మట్లాడుతూ.. తాను ఆ విధంగా రనౌట్​ కావడం కన్నా దురదృష్టం మరొకటి లేదని చెప్పింది. ఇంకా ఏమందంటే..

womens t20 world cup semi final
womens t20 world cup semi final
author img

By

Published : Feb 24, 2023, 10:29 AM IST

Updated : Feb 24, 2023, 10:35 AM IST

INDw vs AUSw : మహిళల టీ20 వరల్డ్​ కప్​ సెమీఫైనల్​లో గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో 5 పరుగుల తేడాతో టీమ్​ఇండియా ఓటమిపాలైంది. ఆఖరు వరకు పోరాడినా.. ఫలితం దక్కలేదు. మ్యాచ్​ మనదే అనుకున్న సమయంలో.. అనూహ్య పరిణామాలతో తొలి సారి ప్రపంచ కప్​ ముద్దాడలనుకున్న కోరిక నెరవేరకుండానే భారత్​ టోర్నీ నుంచి బయటకు వచ్చింది. అయితే ఈ అపజయానికి ప్రధాన కారణం కెప్టెన్​ హర్మత్​ ప్రీత్​ కౌర్​ రనౌట్​.. హర్మన్​ ఇంకా కొద్ది సేపు క్రీజులో ఉంటే టీమ్​ఇండియా గెలుపు ఖాయం అయ్యేది.

మలుపు తిప్పిన రనౌట్​..
వరుస ఫోర్లతో హర్మన్​ ప్రీత్​ కౌర్(52) ఆసీస్​ బౌలర్లపై ఒత్తిడి పెంచింది. ఇది ఇలాగే కొనసాగితే విజయం టీమ్​ఇండియాదే అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా హర్మన్​ భారీ షాట్​ ఆడబోయింది. దీంతో బంతిని ఫీల్డర్​ గార్డనర్​ బౌండరీ లైన్​ వద్ద ఆపింది. ఈ క్రమంలో మొదటి పరుగు పూర్తి చేసుకుని.. రెండో పరుగు కోసం ప్రయత్నిస్తున్న హర్మన్​.. క్రీజులోకి వెళ్లేసరికే కీపర్​ హిలీ స్టంపౌట్​ చేసింది. అయితే, హర్మన్​ క్రీజులో బ్యాట్​ పెట్టలేదు. దీంతో ధర్డ్​ అంపైర్​ రనౌట్​ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి మ్యాచ్​ మలుపు తిరిగింది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్​(14) కూడా వెంటనే ఔట్​ అయింది. అనంతరం వచ్చిన దీప్తి శర్మ(20*) ఫర్వాలేదనిపించినా.. మిగతా వాళ్లంతా అంతగా రాణించలేకపోయారు. ఇక, ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్​ను కట్టుదిట్టంగా చేసింది. మ్యాచ్​ చివర్లో టీమ్​ఇండియా ప్లేయర్లు ఎంత ట్రై చేసినా బౌండరీలు వెళ్లనీయలేదు ఆసీస్​ ఫీల్డర్లు. పెర్రీ, గార్డనర్​ లాంటి ప్లేయర్లు అద్భుతంగా ఫీల్డింగ్​ చేసి భారత్​ పరుగుల చేయకుండా కట్టిడి చేశారు.

'ఇంత కన్నా దురదృష్టం లేదు'
"నేను, జెమీమా రోడ్రిగ్స్ ముమెంటాన్ని తిరిగి పొందడానికి బ్యాటింగ్ చేశాం. కానీ, ఆ తర్వాత మ్యాచ్​ కోల్పోయాం. ఈ రోజు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. నేను అలా రనౌట్​ అవ్వడం కన్నా.. దురదృష్టం మరొకటి లేదు. చివరి బంతి వరకు పోరాడాలనుకున్నాం. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. కానీ, ఈ టోర్నమెంట్​లో మేము చేసిన ప్రదర్శన నాకు సంతోషాన్ని కలిగించింది. ఓపెనర్లు వికెట్​ కోల్పోయినా.. మాకు మంచి బ్యాటింగ్​ లైనప్​ ఉంది. ఇక, ఈరోజు అద్భుత ప్రదర్శన చేసిన జెమీమాకు మనం క్రెడిట్​ ఇవ్వాలి. మేము అనుకున్న ముమెంటాన్ని ఆమె మాకు ఇచ్చింది. అలాంటి ప్రదర్శన చూడటం చాలా ఆనందంగా ఉంది. అయితే మేము మా శక్తి మేరకు ఆడకపోయినా.. సెమీస్​ వరకు చేరుకున్నాం. ఈ మ్యాచ్​లో సులభమైన క్యాచ్​లను విడిచిపెట్టాము. కానీ, మీరు గెలవాలనుకున్నప్పుడు అలాంటి క్యాచ్​లు మిస్​ చేయకూడదు. మేము ఈ తప్పులను నుంచి గుణపాఠాలను నేర్చుకుంటాం. మళ్లీ ఆ తప్పులు పునరావృతం చేయకుండా ఉంటాం" అని హర్మన్​ ప్రీత్​ కౌర్​ మ్యాచ్​ అనంతరం చెప్పుకొచ్చింది.

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెత్​ మూనీ (54), లానింగ్​(49*) రాణించారు. హీలీ(25), గార్డనర్​(31) ఫర్వాలేదనిపించారు. టీమ్ఇండియా బౌలర్లు శిఖా పాండే(2) వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, రాధా యాదవ్​ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగలిగింది. కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ సింగ్(52) హాఫ్​ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసింది. జెమీమా రోడ్రిగ్స్​(43) రాణించింది.

Last Updated : Feb 24, 2023, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.