ETV Bharat / sports

డియర్‌ క్రికెట్‌.. మరొక్క ఛాన్స్‌ ఇవ్వు.. అభిమానులను కదిలించిన ఆటగాడి ట్వీట్‌! - karun nair triple century

టీమ్​ఇండియా ప్లేయర్​ కరుణ్​ నాయర్​కు సుదీర్ఘకాలం జట్టులో అవకాశాలు ఇవ్వకపోవడానికి గల కారణాలపై మేనేజ్‌మెంట్‌ తనకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఆవేదన చెందిన ఆయన తాజాగా ట్విట్టర్​లో ఓ ఎమోషనల్​ పోస్ట్​ షేర్​ చేశాడు. దీంతో అతడి ఫ్యాన్స్​ భావోద్వేగానికి గురయ్యారు.

karun nair emotional post
karun nair
author img

By

Published : Dec 11, 2022, 2:51 PM IST

Karun Nair : భారత టీ20 లీగ్‌, దేశీయ క్రికెట్‌ను అనుసరించే అభిమానులకు కరుణ్ నాయర్‌ పరిచయం అక్కరలేని పేరు. టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఈ ఆటగాడు అదరగొట్టాడు. 2016 చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుల్లో 303 పరుగులు చేసిన రికార్డుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత త్రిశతకం సాధించిన భారత ఆటగాడిగా అప్పట్లో ఇతడి పేరు మార్మోగింది. భవిష్యత్తులో స్టార్‌ ఆటగాడిగా ఎదుగుతాడని అంతా భావించారు. కానీ, 2017లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో వరుస వైఫల్యాలు అతడిని కుదిపేశాయి.

టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత దేశం తరఫున కరుణ్‌ ఆడలేదు. సుదీర్ఘకాలం జట్టులో అవకాశాలు ఇవ్వకపోవడానికి గల కారణాలపై టీమ్‌మేనేజ్‌మెంట్‌ తనకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఈ ఆటగాడు గతంలో ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో దేశవాళి క్రికెట్‌లో కర్ణాటక జట్టు తరఫున కొనసాగాడు. కానీ, కొంతకాలం తర్వాత ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ వంటి రాష్ర్టస్థాయి జట్టుల్లో కూడా ఇతడికి చోటు దక్కలేదు.

ఈ నేపథ్యంలో కరుణ్‌ ట్విటర్‌ వేదికగా భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నాడు. "డియర్‌ క్రికెట్‌.. నాకు మరొక్క ఛాన్స్‌ ఇవ్వు" అంటూ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ ట్వీట్‌ అభిమానులను కదిలించింది. క్రికెట్‌ వర్గాల్లో చర్చకు దారితీసింది. "సోదరా.. నీ త్రిశతకాన్ని మేమింకా మర్చిపోలేదు. నువ్వు కచ్చితంగా మళ్లీ నిరూపించుకుంటావు" అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. తన కెరీర్‌లో 76 భారత టీ20 లీగ్‌ మ్యాచ్‌ల్లో కరుణ్‌ ఆడాడు. 85 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో దాదాపు 50 సగటుతో 5922 పరుగులు చేశాడు.

karun nair emotional post
కరుణ్​ నాయర్​ ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.