ETV Bharat / sports

న్యూజిలాండ్​లో టీమ్​ఇండియా పర్యటన.. దానికోసమే!

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్​లో పర్యటించనుంది భారత మహిళల జట్టు. 2022 మార్చి-ఏప్రిల్​లో ప్రపంచకప్​ (Women's Cricket World Cup)​ జరగనున్న నేపథ్యంలో సన్నాహకంలో భాగంగా 5 వన్డేలు, ఓ టీ20 ఆడనుంది.

World Cup
టీమ్​ఇండియా
author img

By

Published : Nov 12, 2021, 8:29 PM IST

వచ్చే ఏడాది న్యూజిలాండ్​లో మహిళల క్రికెట్ ప్రపంచకప్ (Women's Cricket World Cup 2022)​ జరగనున్న నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించనుంది భారత మహిళల జట్టు. అందుకు సన్నాహకంగా వైట్​ ఫెర్న్స్​ తో (కివీస్​ మహిళల జట్టు ముద్దు పేరు) 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది (INDW VS NZW). ఫిబ్రవరి 9న ఒకే ఒక టీ20తో మొదలయ్యే పర్యటన ఫిబ్రవరి 24న పూర్తవుతుంది. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన వరల్డ్​కప్​ 2022 మార్చి-ఏప్రిల్​లో జరగనుంది.

Indian women's cricket team
టీమ్​ఇండియా

ఇదీ షెడ్యూల్​:

ఫిబ్రవరి 9: ఏకైక టీ20 మ్యాచ్​ (నేపియర్)

ఫిబ్రవరి 11: తొలి వన్డే (నేపియర్)

ఫిబ్రవరి 14: రెండో వన్డే (నెల్సన్)

ఫిబ్రవరి 16: మూడో వన్డే (నెల్సన్)

ఫిబ్రవరి 22: నాలుగో వన్డే (క్వీన్స్​టౌన్)

ఫిబ్రవరి 24: ఐదో వన్డే (క్వీన్స్​టౌన్)

టీమ్​ఇండియా మ్యాచ్​తోనే ఆరంభం..

World Cup
ఆస్ట్రేలియా x ఇండియా

2022 కామన్వెల్త్​ (Commonwealth Games 2022) మహిళల క్రికెట్ పోటీలు వచ్చే ఏడాది జులై 29న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్​తో (Commonwealth Games 2022 India) ఆరంభం కానున్నాయి. టీ20 ఫార్మాట్​తో కామన్వెల్త్​ క్రీడల్లో మహిళల క్రికెట్ అరంగేట్రం చేస్తోంది. ఇంగ్లాండ్​ వేదికగా ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. 1998 ఎడిషన్​లో (కౌలాలంపూర్​) క్రికెట్​ చివరిసారి ఆడారు. ఆగస్టు 7న కాంస్యం, బంగారు పతకం కోసం మ్యాచ్​లు జరగనున్నాయి.

భారత్​లో కివీస్​ పర్యటన..

పురుషుల టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021)​ గ్రూప్​ దశలో టీమ్​ఇండియాను ఓడించి సెమీస్​ చేరిన కివీస్​.. ఇంగ్లాండ్​పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం (నవంబర్ 14న) టైటిల్ పోరు జరగనుంది. ఆ తర్వాత భారత్​లో పర్యటించనుంది (New Zealand Tour of India) కివీస్. నవంబర్​ 17 నుంచి మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన కోసం ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. బయోబబుల్​ కారణంగా​ పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్​రౌండర్ కొలిన్ డీ గ్రాండ్​ హోమ్​ టెస్టు సిరీస్​కు దూరమవుతున్నారని పేర్కొంది.

న్యూజిలాండ్(టెస్టు జట్టు):

కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), డెవాన్ కాన్వే, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, రాస్ టేలర్, విల్ యంగ్

న్యూజిలాండ్(టీ20 జట్టు):

కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మార్టిన్ గప్తిల్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్ (వికెట్‌ కీపర్‌), ఇష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే

ఇదీ షెడ్యూల్​:

భారత్, కివీస్​ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపుర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్​కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్​తో టెస్టు మ్యాచ్​లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్​లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.

ఇదీ చూడండి: కివీస్​తో టెస్టులకు జట్టు ప్రకటన.. రోహిత్, పంత్​కు విశ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.