భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి, కర్ణాటక బ్యాటర్ అర్జున్ హొయసాల త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రికెటర్లు ఇద్దరూ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో అర్జున్ మోకాళ్లపై కూర్చుని చాలా రొమాంటిక్‌గా వేదాకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా వేదా.. టీమ్ఇండియా తరపున 48 వన్డేలు, 76 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. 2017 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులోనూ.. 2020 టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా భాగమైంది. కానీ కొంత కాలంగా ఆమె భారత జట్టుకు దూరంగా ఉంది.
ఇదీ చూడండి: Asiacup 2022: ఛాంపియన్ శ్రీలంకకు ప్రైజ్మనీ ఎంతంటే?