ETV Bharat / sports

అదరగొట్టిన ధావన్​, గిల్​.. ఉత్కంఠ పోరులో భారత్​ విజయం - ఇండియా వెస్టిండీస్​ వన్డే మ్యాచ్​

IND VS WI ODI: వెస్టిండీస్‌తో మూడు వన్డేల్లో భాగంగా మొదటి మ్యాచ్‌లో.. టీమ్ఇండియా మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(97), శుభ్‌మన్‌ గిల్‌(64), శ్రేయస్‌ అయ్యర్‌(54) అర్ధశతకాలతో మెరిశారు.309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి విండీస్‌ ఆఖరి బంతి వరకూ పోరాడింది.

ind vs wi match
ind vs wi match
author img

By

Published : Jul 23, 2022, 3:28 AM IST

Updated : Jul 23, 2022, 3:55 AM IST

IND VS WI ODI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల ఈ సిరీస్‌లో శుభారంభం చేసి బోణీ కొట్టింది. 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి విండీస్‌ ఆఖరి బంతి వరకూ పోరాడింది. ఈ క్రమంలోనే చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా 11 పరుగులు చేసి చివరికి 305/6తో సరిపెట్టుకుంది. అయితే, లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రోమారియో షెపర్డ్‌ (39 నాటౌట్‌) చివర్లో ధాటిగా ఆడి భారత్‌ను కంగారు పెట్టించాడు. హోసీన్‌ (33 నాటౌట్‌)తో కలిసి అతడు విండీస్‌ను గెలిపించినంత పనిచేశాడు. అయితే, సిరాజ్‌ ఆఖరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బంతులేసి ఉత్కంఠకర పరిస్థితుల్లో భారత్‌ను గెలిపించాడు.

ఆదిలోనే వికెట్‌ దక్కినా..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను సిరాజ్‌ ఆదిలోనే దెబ్బతీశాడు. ఐదో ఓవర్‌లో షై హోప్‌ (7)ను ఔట్‌ చేసి శుభారంభం అందించాడు. దీంతో విండీస్‌ 16 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే, కైల్‌ మేయర్స్‌ (75), బ్రూక్స్‌ (46) రెండో వికెట్‌కు 117 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించి విండీస్‌ను పోటీలో నిలబెట్టారు. ఈ క్రమంలోనే మేయర్స్‌ ధాటిగా ఆడగా బ్రూక్స్‌ నెమ్మదిగా ఆడాడు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ శతక భాగస్వామ్యం నిర్మించారు. దీంతో ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దనీ శార్దూల్ ఠాకూర్‌ స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేశాడు. తొలుత బ్రూక్స్‌ శ్రేయస్‌ చేతికి చిక్కగా తర్వాత మేయర్స్‌ వికెట్‌ కీపర్‌కు చిక్కాడు. దీంతో విండీస్‌ 138 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది. అనంతరం బ్రాండన్‌ కింగ్‌ (54), కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (25) నిలకడగా ఆడి వికెట్లను కాపాడుకున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ స్కోరుబోర్డును ముందుకు నడిపించి జట్టును పోటీలో నిలబెట్టారు. కానీ, కీలక సమయంలో సిరాజ్‌, చాహల్‌.. పూరన్‌, రామన్‌ పావెల్‌ (6)లను పెవిలియన్‌ పంపి భారత్‌కు ఊరటనిచ్చారు. దీంతో విండీస్‌ 37 ఓవర్లకు 196/5తో నిలిచి కాస్త వెనుకపడినట్లు అనిపించింది. ఇక భారత బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించినట్లే అనుకుంటున్న సమయంలో కింగ్‌, హోసీన్‌ ఆచితూచి ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 56 పరుగుల మరో కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పి ఆ జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న వీరిని చాహల్‌ విడదీశాడు. అర్ధ శతకంతో దూసుకుపోతున్న కింగ్‌ను ఓ చక్కటి డెలివరీకి బోల్తాకొట్టించాడు. దీంతో విండీస్‌ 252 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షెపర్డ్‌ ధాటిగా ఆడి విండీస్‌ను గెలిపించేందుకు తీవ్రంగా కష్టపడ్డాడు. ఆఖరి బంతివరకూ క్రీజులో నిలబడి మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు.

ఇవీ చదవండి: జడేజాకు గాయం.. విండీస్​తో జరిగే సిరీస్​కు దూరం!

'విండీస్​ సిరీస్​కు విరాట్​ను దూరం పెట్టడం వల్ల తప్పుడు సంకేతాలు'

Last Updated : Jul 23, 2022, 3:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.