ETV Bharat / sports

అదరగొట్టిన కోహ్లీ, సూర్య.. టీమ్​ఇండియా విజయం.. సిరీస్ కైవసం - టీమ్ఇండియా ఆసీసీ మ్యాచ్​ వార్తలపు

india vs australia third t20 match winner

author img

By

Published : Sep 25, 2022, 10:35 PM IST

Updated : Sep 25, 2022, 10:49 PM IST

22:29 September 25

అదరగొట్టిన కోహ్లీ, సూర్య.. టీమ్​ఇండియా విజయం.. సిరీస్ కైవసం

ఆసీస్‌తో ఉత్కంఠగా సాగిన నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో భారత్​ ఖాతాలోకి మరో టీ20 సిరీస్ చేరింది.

బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (69), విరాట్‌ కోహ్లీ (63) హాఫ్‌ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆఖర్లో హార్దిక్‌ (25*) కూడా నిలకడగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డేనియల్‌ సామ్స్‌ 2 వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్‌, ప్యాట్‌ కమిన్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఫించ్‌సేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ కామెరూన్‌ (52), టిమ్‌ డేవిడ్‌ (54) ఇద్దరు అర్ధ శతకాలతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఇంగ్లిస్‌ (24), డేనియల్‌ సామ్స్‌(28*) కూడా రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ 3 వికెట్లు తీయగా.. భువీ, చాహల్‌, హర్షల్ తలో వికెట్‌ తీశారు.

Last Updated : Sep 25, 2022, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.