ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు దిశగా టీమ్‌ఇండియా మరో సమరానికి సై అంటోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మరోసారి ఆసీస్‌ను చిత్తుచేసి.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆడిన 24 టెస్టుల్లో భారత్ 20 టెస్టుల్లో గెలిచింది. నాలుగు డ్రా అయ్యయి.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛెతెశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, రవి చంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా తుది జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, త్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారే(కీపర్), టాడ్ మార్ఫీ, నాథన్ లయోన్, మాత్యూ కునేమన్
పుజారా అరుదైన ఘనత..!
ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా ఓ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. తన కెరీర్లో వందో టెస్ట్ ఆడనున్నాడు. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన పుజారా ఇప్పటి వరకు 99 టెస్ట్ మ్యాచుల్లో ఆడాడు. 44.16 సగటుతో 7,021 రన్స్ స్కోర్ చేసిన పుజారా.. డిఫెన్స్ ఆడుతూ ప్రత్యర్థి ప్లేయర్లకు చుక్కలు చూపిస్తూ 'నయా వాల్'గా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో 19 సెంచరీలు ఇరగదీసిన పుజరా.. 3 డబుల్ సెంచరీలతో పాటు 34 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక ఈ ప్లేయర్ తన వందో టెస్టులో సెంచరీ కొట్టాలని టీమ్‌ఇండియా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ కోరుకున్నాడు.