ETV Bharat / sports

టీమ్​ఇండియా మరో సిరీస్​ పట్టేస్తుందా.. వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడే - ఇండియా వెస్టిండీస్​ ప్రివ్యూ

IND Vs WI Second ODI: చాలా కాలం తర్వాత మళ్లీ ఫామ్‌ అందుకున్న ధావన్‌, శ్రేయస్‌.. దాదాపు 19 నెలల విరామం అనంతరం ఆడిన తొలి వన్డేలో సత్తాచాటిన శుభ్‌మన్‌ గిల్‌.. ప్రధాన బౌలర్ల గైర్హాజరీలో పేస్‌ విభాగాన్ని సమర్థంగా నడిపించిన సిరాజ్‌.. వెరసి వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న టీమ్‌ఇండియా దూకుడు మీదుంది. ఇదే జోరులో నేడు రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. మిడిలార్డర్‌ గాడిన పడితే జట్టుకు తిరుగులేనట్టే!

IND Vs WI Match Preview
IND Vs WI Match Preview
author img

By

Published : Jul 24, 2022, 7:01 AM IST

IND Vs WI Second ODI: అదే వేదిక.. అదే ప్రత్యర్థి.. మూడు రోజుల వ్యవధిలో వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. శుక్రవారం తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి భయపెట్టినా.. కీలక సమయంలో ఒత్తిడి అధిగమించి మూడు పరుగుల తేడాతో భారత్‌ గెలిచింది. ఆదివారం రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి మరో పోరు మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి విండీస్‌ తెగించి ఆడొచ్చు.

వీళ్లు రాణిస్తే..
కెప్టెన్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌.. ఈ టాప్‌ఆర్డర్‌ తొలి వన్డేలో భారత్‌ భారీస్కోరుకు బాటలు వేసింది. కొంతకాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న ధావన్‌, శ్రేయస్‌ తిరిగి పరుగులు చేయడం ఊరట కలిగించే విషయం. రుతురాజ్‌, ఇషాన్‌ను దాటి ఓపెనర్‌గా వచ్చిన గిల్‌ రాణించడం శుభ పరిణామం. రెండో వన్డేలోనూ ఈ త్రయం ఇదే జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఇక గత మ్యాచ్‌లో విఫలమైన మిడిలార్డర్‌ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. ఆ మ్యాచ్‌లో 350కి పైగా పరుగులు చేసేలా కనిపించిన జట్టు మిడిలార్డర్‌ వైఫల్యంతో తక్కువ స్కోరుకే సరిపెట్టుకుంది. దీపక్‌ హుడా, సూర్య కుమార్‌ కాస్త సమయం క్రీజులో గడిపితే సరిపోతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం శాంసన్‌కు అత్యావశ్యకం. బౌలింగ్‌లో సిరాజ్‌, శార్దూల్‌, చాహల్‌తో పాటు మిగతా బౌలర్లూ వికెట్లు తీయాలి. ప్రమాదకర బ్యాటింగ్‌ లైనప్‌తో కూడిన విండీస్‌ను ఎంత త్వరగా కట్టడి చేస్తే అంత మంచింది.

గెలుపు కోసం..
తొలి వన్డేలో గెలిచినంత పని చేసిన వెస్టిండీస్‌.. ఈ సారి విజయ తీరాలకు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. వన్డేల్లో గత ఏడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు వరుస పరాజయాలకు చెక్‌ పెట్టాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో బంతి పాతబడ్డాక ఆ జట్టు బౌలర్లు గొప్పగా రాణించి టీమ్‌ఇండియాకు కళ్లెం వేశారు. ఇక బ్యాటర్లు విజయం కోసం చివరి వరకూ పోరాడారు. ఈ మ్యాచ్‌లోనూ అదే పోరాట పటిమ ప్రదర్శించాలని పూరన్‌ సేన భావిస్తోంది. వన్డే ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో ఈ సిరీస్‌ భాగం కాదు కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా విండీస్‌ ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో అల్జారి జోసెఫ్‌, మోటీ ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో మేయర్స్‌, బ్రూక్స్‌, కింగ్‌ రాణించారు. వీళ్లతో పాటు కెప్టెన్‌ పూరన్‌, హోప్‌ క్రీజులో నిలబడాలని జట్టు కోరుకుంటోంది. కానీ భారత బౌలర్లు వీళ్లకు ఆ అవకాశం ఇవ్వకూడదు.

తుది జట్లు (అంచనా)
భారత్‌: ధావన్‌, గిల్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, శాంసన్‌, దీపక్‌, అక్షర్‌, శార్దూల్‌, సిరాజ్‌, చాహల్‌, ప్రసిద్ధ్‌
వెస్టిండీస్‌: హోప్‌, మేయర్స్‌, బ్రూక్స్‌, కింగ్‌, పూరన్‌, పావెల్‌, అకీల్‌, షెఫర్డ్‌, అల్జారి జోసెఫ్‌, సీల్స్‌, మోటీ.

పిచ్‌ ఎలా ఉంది?
తొలి వన్డేలో పిచ్‌ మొదట బ్యాటింగ్‌కు చక్కగా సహకరించింది. కానీ బంతి కాస్త పాతబడ్డాక పరుగులు కష్టంగా వచ్చాయి. ఛేదనలోనూ బ్యాటర్లు పరుగులు రాబట్టారు. ఈ మ్యాచ్‌లోనూ పిచ్‌ స్వభావంలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. పిచ్‌ కాస్త నెమ్మదిస్తే బౌలర్లు ఎక్కువగా ప్రభావం చూపే ఆస్కారముంది.

ఇవీ చదవండి: లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్​పై కీలక నిర్ణయం.. ఇక్కడే నిర్వహించేలా..

ఇకపై అంపైర్లకు స్పెషల్​ కేటగిరీ.. టాప్‌లో ఎవరున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.