ETV Bharat / sports

'షెడ్యూల్​లో మార్పులు చేయండి'.. బీసీసీఐకి లంక బోర్డు వినతి! - బీసీసీఐ శ్రీలంక

IND VS Srilanka: ముందుగా అనుకున్న షెడ్యూల్​ ప్రకారం కాకుండా సిరీస్​లో మార్పులు చేయాలని బీసీసీఐని శ్రీలంక బోర్డు అభ్యర్థించినట్లు తెలిసింది. టెస్టులతో కాకుండా టీ20లతో సిరీస్​ను ప్రారంభించాలని కోరినట్లు క్రికెట్​ వర్గాల సమాచారం.

IND VS Srilanka
IND VS Srilanka
author img

By

Published : Jan 26, 2022, 4:43 PM IST

IND VS Srilanka: వచ్చే నెల నుంచి శ్రీలంక జట్టు భారత్​లో పర్యటించనుంది. ఈ టూర్​లో భాగంగా ఇరు జట్లు రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనున్నాయి. అయితే ఈ సిరీస్ షెడ్యూల్​లో మార్పులు చేయాలని బీసీసీఐని శ్రీలంక బోర్డు అభ్యర్థించినట్లు సమాచారం. ముందు టీ20లు జరిపి ఆ తర్వాత టెస్టులు నిర్వహించాలని కోరినట్లు తెలిసింది.

ఫిబ్రవరి 25నుంచి టీమ్​ఇండియాతో టెస్టు సిరీస్​ ఆడనుంది లంక. ఈ పర్యటనకు ముందు ఫిబ్రవరి 5- 20 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ నుంచి వచ్చే జట్టును భారత్​కు పంపించే యోచనలో ఉంది. అప్పటికే అక్కడ బబుల్​లో ఉన్న ప్లేయర్లనే తిరిగి కొనసాగించొచ్చని ఆ బోరు ఆలోచన.

అదే టెస్టు సిరీస్​ను నిర్వహిస్తే తాము మళ్లీ టీ20 జట్టు ప్లేయర్స్​ను వెనక్కి పిలిపించాల్సి ఉంటుంది. ఒకవేళ బీసీసీఐ షెడ్యూల్​లో మార్పులు చేసి ముందుగా టీ20 పెడితే తమకు అనుకూలంగా ఉంటుందని కోరింది.

కాగా, తొలి టెస్టును(ఫిబ్రవరి 25-మార్చి 1) బెంగళూరులో నిర్వహించనుండగా.. రెండు టెస్టును(మార్చి 5-9) మోహాలిలో ఆడించనున్నారు. ఇక తొలి టీ20(మార్చి 13, మోహాలి), రెండోది మార్చి 15న ధర్మశాల, మూడోది మార్చి 18న లక్నోలో నిర్వహించనున్నారు.

వేదికలు కుదించే యోచనలో

ఇప్పటికే వెస్టిండీస్​తో జరగబోయే సిరీస్​కు వేదికలను కుదించే ఆలోచనలో ఉన్న బీసీసీఐ లంక సిరీస్​ వేదికలను కూడా కుదించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

వెస్టిండీస్​తో సిరీస్​.. ఆరేళ్ల తర్వాత ఆ క్రికెటర్​ రీఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.