ETV Bharat / sports

IND VS SL: ఇషాన్​ కిషన్​తో కలిసి కోహ్లీ నాటు డ్యాన్స్​.. చూశారా?

టీమ్​ఇండియా స్టార్‌ బ్యాటర్​ కోహ్లీ.. ఇషాన్ కిషన్​తో కలిసి డ్యాన్స్​ వేశాడు. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. దాన్ని మీరు చూసేయండి..

Kohli Ishna kishan dance video viral
IND VS SL: ఇషాన్​ కిషన్​తో కలిసి కోహ్లీ డ్యాన్స్​
author img

By

Published : Jan 13, 2023, 4:41 PM IST

టీమ్​ఇండియా స్టార్‌ బ్యాటర్​ కోహ్లీ బ్యాట్​తో మాత్రమే కాదు.. మైదానం బయట ప్రేక్షకులను అలరించడంలో ముందుంటాడు. తనదైన శైలిలో ఎంటర్​టైన్మెంట్​ చేస్తూ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటాడు. అయితే శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో విరాట్.. మైదానంలోనే సెలబ్రేట్‌ చేసుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన ఝార్ఖండ్‌ డైనమైట్‌ ఇషాన్ కిషన్​తో కలిసి మైదానంలో స్టెప్పులు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. బంగాల్​ క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన లేజర్‌ లైట్‌ షో వెలుగుల్లో హుషారుగా స్టెప్పులేస్తూ తన డాన్సింగ్‌ స్కిల్స్​ను ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల తెగ లైక్స్​, కామెంట్స్ పెడుతున్నారు.

కాగా, తొలి మ్యాచ్​లో తన 73వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో మాత్రం 4 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు.. రోహిత్ శర్మ(17), శుభమన్​ గిల్​(17), శ్రేయస్‌ అయ్యర్‌(28) కూడా నిరాశపరచడంతో జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కేఎల్‌ రాహుల్‌ ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో టీమ్​ఇండియాను సిరీస్‌ 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఇదే మ్యాచ్​లో లంకను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

ఇదీ చూడండి: 'మన టాలెంట్​ను చూపించడానికి ఇదే బెస్ట్​ ఛాన్స్​'.. అమ్మాయిలకు సచిన్​ సలహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.