ETV Bharat / sports

Ind Vs Pak Super 4 : రోహిత్-గిల్​ హాఫ్ సెంచరీ.. పాక్​ బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు! - శుభ్​మన్​ గిల్​ హాఫ్​ సెంచరీ

Ind Vs Pak Super 4 : ఆసియా కప్‌ సూపర్​ 4 మ్యాచ్​లో భారత బ్యాటర్లు చెలరేగుతున్నారు. ఓపెనర్లుగా దిగిన రోహిత్​, శుభ్​మన్..హాఫ్ సెంచరీలతో చెలరేగి మంచి శుభారంభం అందించారు.

Ind Vs Pak Super 4 : హాఫ్​ సెంచరీ మార్క్ దాటిన రోహిత్​, గిల్​.. సెంచరీ దాటకుండానే..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 4:47 PM IST

Ind Vs Pak Super 4 : ఆసియా కప్‌ సూపర్​ 4 మ్యాచ్​లో భారత బ్యాటర్లు చెలరేగుతున్నారు. 21 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేశారు. టీమ్​ఇండియా మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లుగా దిగిన కెప్టెన్​ రోహిత్ శర్మ​, శుభ్​మన్ గిల్​ విజృంభించారు. అర్ధ శతకాలను తమ ఖాతాల్లోకి వేసుకున్నారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్​కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మ్యాచ్ మొదలైందిలా.. ఓ వైపు ఆకాశమే హద్దుగా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ చెలరేగిపోగా.. అతనికి రోహిత్​ పార్టనర్​షిప్​ తోడవ్వడం వల్ల స్కోర్​ బోర్డు పరుగులు పెట్టింది. గత మ్యాచ్​లో భారత ప్లేయర్లను ఓ ఆట ఆడుకున్న పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదిని.. ఈ మ్యాచ్​లో గిల్​ టార్గెట్‌ చేశాడు. అతను వేసిన ఇన్నింగ్స్‌ 3, 5 ఓవర్లలో ఏకంగా ఆరు బౌండరీలు బాదుతూ చెలరేగిపోయాడు. అంతటితో ఆగకుండా .. ఆ తర్వాత కూడా తన దూకుడును అలానే కొనసాగించాడు.

ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో నసీం షా బౌలింగ్‌లో రెండు బౌండరీలు, ఫహీమ్‌ అఫ్రాఫ్‌ వేసిన ఓవర్‌లో మరో బౌండరీ బాది నలబైల్లోకి ప్రవేశించిన గిల్​..కొద్ది సేపట్లోనే హాఫ్​ సెంచరీ మార్క్​ను దాటేశాడు. సుమారు 51 బంతులకు 58 పరుగులు స్కోర్​ చేస్తూ దూసుకెళ్లాడు. అయితే షాహీన్ అఫ్రీదీ వేసిన బౌలింగ్​లో అఘా సల్మాన్​ చేతికి చిక్కిన గిల్​.. అనూహ్యంగా పెవిలియన్​ బాట పట్టాడు.

మరో వైపు ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్‌ కూడా హాఫ్​ సెంచరీ మార్క్​ దాటాడు. మధ్యలో చాలా నిదానంగా ఆడినప్పటికీ.. నసీం షా వేసిన 10వ ఓవర్‌లో వరుసగా 2 బౌండరీలు బాది తన ఫామ్​ను ప్రదర్శించాడు. అలా 49 బంతుల్లో 56 పరుగులు తీసిన రోహిత్​.. షాదాబ్‌ ఖాన్‌ వేసిన 16.4 ఓవర్‌కు భారీ షాట్ ఆడి ఫహీమ్ అష్రాఫ్‌కు చిక్కాడు. దీంతో 121 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 123 పరుగల వద్ద గిల్​ వికెట్​ కోల్పోడం వల్ల టీమ్ఇండియా రెండో వికెట్​ నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ కొనసాగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.