ETV Bharat / sports

IND VS BAN: తొలి రోజు భారత్‌దే.. విజృంభించిన అశ్విన్​, ఉమేశ్​ - IND VS BAN second test live score

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఈ ఆట పూర్తయ్యేసరికి టీమ్​ఇండియాకే ఆధిపత్యం దక్కింది.

IND VS BAN second test
IND VS BAN: తొలి రోజు భారత్‌దే.. విజృంభించిన అశ్విన్​, ఉమేశ్​
author img

By

Published : Dec 22, 2022, 4:48 PM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు టీమ్‌ఇండియాకే ఆధిపత్యం దక్కింది. సీనియర్‌ బౌలర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్ యాదవ్ అదరగొట్టేశారు. దీంతో ఒక దశలో 213/5తో పటిష్ఠంగానే కన్పించిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. మామినుల్‌ హక్(84: 12 ఫోర్లు, ఒక సిక్స్‌) ఒంటరి పోరాటం చేసినా ఇతర ఆటగాళ్లెవరూ సహకరించలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఉమేశ్‌, అశ్విన్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. జయదేవ్‌ ఉనద్కత్‌ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి.

ఆ తర్వాత బ్యాటింగ్‌ మొదలుపెట్టిన భారత జట్టు నిలకడగా ఆడింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్ (3*)‌, శుభ్‌మన్‌ గిల్‌(14*) క్రీజులో ఉన్నారు. మధ్యలో రెండుసార్లు వీరు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను కుదించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్ నష్టపోకుండా 19 పరుగులతో ఉంది.

కాగా, బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న రెండో టెస్టులోనూ నెగ్గి సిరీస్‌ను క్వీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. అలా జరిగితేనే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరులో నిలిచేందుకు భారత్‌కు అవకాశాలు మెరుగుపడుతాయి.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్​కు అప్పగిస్తున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.