Ind vs Aus World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (IND vs AUS) ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్పిన్నర్లు మంచిగా రాణించారు. దీంతో ఆసీస్ 49.3 ఓవర్లలో ఆలౌటై 199 పరుగులు చేసింది. ఫలితంగా టీమ్ ఇండియా ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 46; 5x4), వార్నర్(52 బంతుల్లో 41; 6x4) బాగానే రాణించారు. మార్నస్ లబుషేన్(27), గ్లెన్ మ్యాక్స్‌వెల్(15), ప్యాట్ కమిన్స్(15) నామమాత్రపు స్కోరు చేశారు. ఇక చివర్లో వచ్చిన మిచెల్ స్టార్క్(28) స్కోరు బోర్డును కాస్త ముందుకు తీసుకెళ్లాడు. అడం జంపా(6), జోష్ హెజిల్వుడ్(1*) స్కోర్ చేశారు. స్పిన్నర్లకే అనుకూలమైన చెపాక్ పిచ్‌పై భారత బౌలర్లు అదరగొట్టారు. జడేజా (3/28) మ్యాజిక్ చేశాడు. కుల్‌దీప్ (2/42), అశ్విన్ (1/34) చక్రం తిప్పారు. పేసర్ బుమ్రా (2/35) కూడా రాణించగా.. సిరాజ్, హార్దిక్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
మ్యాచ్ సాగిందిలా.. మొదటి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే ఇచ్చిన బుమ్రా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో వికెట్ తీసి... వన్డే ప్రపంచ కప్ టోర్నీని ఘనంగా ఆరంభించాడు. 6 బంతులు ఆడిన మిచెల్ మార్ష్.. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌కు ఔట్ అయ్యాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్‌ను డకౌట్ చేసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు బుమ్రా.
ఆ తర్వాత వార్నర్, స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 52 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసిన వార్నర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ ఔట్ కావడం ఇది 11వ సారి.
ఇక 41 బంతుల్లో ఓ ఫోర్‌తో 27 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కామెరూన్ గ్రీన్‌ను రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేశాడు. 20 బంతుల్లో 8 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, అశ్విన్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అలా 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, అడం జంపా ఔట్ అయ్యారు. ఇక చివర్లో వచ్చిన మిచెల్ స్టార్క్ 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసి ఆస్ట్రేలియా స్కోరును 200 మార్కుకు చేర్చాడు. ఫైనల్‌గా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆఖరి 3 వికెట్లకు 59 పరుగులు జోడించడం విశేషం.
-
Innings break!
— BCCI (@BCCI) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia are all out for 199 courtesy of a solid bowling performance from #TeamIndia 👏👏
Ravindra Jadeja the pick of the bowlers with figures of 3/28 👌👌
Scorecard ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #MeninBlue pic.twitter.com/TSf9WN4Bkz
">Innings break!
— BCCI (@BCCI) October 8, 2023
Australia are all out for 199 courtesy of a solid bowling performance from #TeamIndia 👏👏
Ravindra Jadeja the pick of the bowlers with figures of 3/28 👌👌
Scorecard ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #MeninBlue pic.twitter.com/TSf9WN4BkzInnings break!
— BCCI (@BCCI) October 8, 2023
Australia are all out for 199 courtesy of a solid bowling performance from #TeamIndia 👏👏
Ravindra Jadeja the pick of the bowlers with figures of 3/28 👌👌
Scorecard ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #MeninBlue pic.twitter.com/TSf9WN4Bkz
World Cup 2023 Ind vs Aus : చెపాక్‌లో భారత్ తొలిపోరు.. ఆస్ట్రేలియాపై జోరు ప్రదర్శించేనా?