ETV Bharat / sports

Ind vs Aus 1st ODI 2023 : తొలి వన్డేలో ఆసీస్ చిత్తు.. ఆల్​రౌండ్ ప్రదర్శనతో భారత్ జయభేరి.. ఏడాదిన్నర తర్వాత నెం.1కు టీమ్ఇండియా - team india odi rank

Ind vs Aus 1st ODI 2023 : మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్​లో భారత్.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో టీమ్ఇండియా వన్డే ర్యాంకింగ్స్​లో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. దీంతో మూడు ఫార్మాట్లలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Ind vs Aus 1st ODI 2023
Ind vs Aus 1st ODI 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 9:45 PM IST

Updated : Sep 22, 2023, 10:58 PM IST

Ind vs Aus 1st ODI 2023 : మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో.. భారత్ ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ప్రత్యర్థి ఆసీస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో ఛేదించి గెలుపొందింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు శుభ్​మన్ గిల్ (74 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (71 పరుగులు) అర్ధసెంచరీలతో జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. తర్వాత కెప్టెన్ రాహుల్ (58*), సూర్యకుమార్ యాదవ్ (50 పరుగులు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు వికెట్లతో రాణించిన భారత బౌలర్ షమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్.. వన్డే ర్యాంకింగ్స్​లో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. దీంతో టీమ్ఇండియా.. ప్రస్తుతం మూడు ఫార్మట్లలో టాప్​ ప్లేస్​లో కొనసాగుతోంది.

ఆరంభం అదిరెన్.. 277 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు ఘనమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు గిల్, రుతురాజ్ తొలి వికెట్​కు 142 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు జట్టు రన్​రేట్ 6కు తగ్గకుండా చూసుకున్నారు. ప్రత్యర్థి జట్లు బౌలర్లనే ఆత్మ రక్షణలో పడేసి.. ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే రుతురాజ్ వన్డే కెరీర్​లో తొలి అర్ధ శతకం సాధించాడు.

మరోవైపు గిల్​.. కెరీర్​లో తొమ్మిదో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో 21.4 ఓవర్ వద్ద.. అడమ్ జంపా రుతురాజ్​ను ఎల్​బీడబ్ల్యూగా పెలివియన్ చేర్చాడు. అనంతరం వన్ డౌన్​లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (3).. తొందరపాటులో రనౌట్​ అయ్యాడు. ఇక సెంచరీ దిశగా వెళ్తున్న గిల్​ కూడా కొంతసేపటికే ఔటయ్యాడు.

రాహుల్-సూర్య ద్వయం.. 151 పరుగులుకు టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్​కు, ఇషాన్ తోడయ్యాడు. కానీ ఇషాన్ (18) కమిన్స్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్.. చాలా రోజులకు వన్డేల్లో రాణించాడు. అతడు క్రీజులో కుదురుకొని.. రాహుల్​తో కలిసి స్కోర్​ బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరి భాగస్వామ్యం టీమ్ఇండియా విజయాన్ని సులభం చేసింది. ఆఖర్లో సూర్య, రాహుల్ కూడా 50 పరుగుల మార్క్ అందుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆసీస్​ ఓవర్లన్నీ ఆడి 276 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబుషేన్ (39), జోష్ ఇంగ్లిస్ (45), కామెరూన్ గ్రీన్ (31) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5, జస్​ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్​లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇందౌర్​ వేదికగా జరగనుంది.

ICC World Cup History : 10 జట్లు.. ఒకే వరల్డ్​ కప్​​.. ఎవరు తయారు చేశారో తెలుసా?.. కాస్ట్​ ఎంతంటే?

Ind Vs Aus ODI : భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డే.. రికార్డుల వేటలో రాహుల్​, అశ్విన్​!

Last Updated : Sep 22, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.