ETV Bharat / sports

Shami World Cup Wickets : సూపర్​ ఫామ్​లో షమీ.. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో.. - మహ్మద్ షమీ వరల్డ్​ కప్​ వికెట్లు

Shami World Cup Wickets : ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో చెలరేగిన టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. వన్డే వరల్డ్​కప్​ల్లో ​అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆ వివరాలు.

Shami World Cup Wickets
Shami World Cup Wickets
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 6:21 PM IST

Updated : Oct 30, 2023, 6:57 PM IST

Shami World Cup Wickets : టీమ్​ఇండియా స్టార్​ పేసర్​ మహ్మద్​ షమీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. అదివారం ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి.. వన్డే వరల్డ్​ కప్​ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల​ జాబితాలో మొదటి స్థానానికి చేరువయ్యాడు. ఇప్పటివరకు 13 వరల్డ్​ కప్​ ఇన్నింగ్స్​లు ఆడిన షమీ.. 40 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్​గా వెటరన్ పేసర్ జహీర్ ఖాన్ మొదటి స్థానంలో ​కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్​ కప్​ల్లో మొత్తం 23 ఇన్నింగ్స్​లు ఆడిన షమీ 44 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జవగళ్ శ్రీనాథ్.. మొత్తం 33 ఇన్నింగ్స్​లు ఆడి 44 వికెట్లు తీశాడు.

India Vs England World Cup 2023 : 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఆదివారం ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించి నాకౌట్‌ బెర్తును ఖారారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్​ ​ 229 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్​ 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో గెలుపొందింది. లివింగ్‌స్టోన్ (27) టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. అయితే భారత బౌలర్ల ధాటికి స్వల్ప టార్గెట్​ను కూడా ఛేదించలేకపోయింది ఇంగ్లాండ్. షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ ముప్పేట ఆ జట్టుపై ముప్పేట దాడి చేశారు. వీరి ధాటికి గట్టి బ్యాటింగ్​ లైనప్​ ఉన్న ఇంగ్లాండ్​ కూడా తట్టుకోలేకపోయింది. అందులో ముఖ్యంగా షమీ నాలుగు వికెట్లు అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ ప్రతి బంతికీ వికెట్‌ తీసేలా అనిపించింది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి వికెట్లనే లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ చేశాడు. అయితే ఎప్పుడైతే షమీ జట్టుతో చేరాడో అప్పటి నుంచి టీమ్​ఇండియా పేస్‌ విభాగం మరింత పదునెక్కింది. ఈ వరల్డ్‌ కప్‌లో తొలిసారి కివీస్‌పై ఆడిన షమీ.. ఐదు వికెట్ల (Shami World Cup 2023 Wickets) ప్రదర్శన చేసి అబ్బురపరిచాడు.

ODI World Cup 2023 IND vs ENG : స్టంప్స్​నే టార్గెట్​ చేస్తూ చెలరేగిన టీమ్ఇండియా.. ఇంగ్లాండ్​పై స్పెషల్​ వికర్టీ

Rashid Khan Ratan Tata : 'రషీద్ ఖాన్​కు రూ.10 కోట్లు రివార్డు'.. ఆ వార్తలతో తనకేం సంబంధం లేదన్న రతన్ టాటా

Last Updated : Oct 30, 2023, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.